మనీ: పెట్టుబడి తక్కువ.. ఆదాయాన్ని అధికంగా అందించే బిజినెస్ ఐడియా ఇదే..!

Divya
ముఖ్యంగా సొంతంగా బిజినెస్ చేయాలని ఆసక్తి చూపుతున్న వారు.. అలాగే ఉద్యోగంలో విసిగిపోయి బిజినెస్ చేయాలనుకునేవారు.. ఇతరులకు ఉపాధి కల్పించాలని ఆలోచిస్తున్న వారికి ఒక మంచి బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అదే బంగాళదుంప చిప్స్ వ్యాపారం. ప్రస్తుతం చిరుతిండ్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో మీరు ఇలాంటి వ్యాపారాన్ని మొదలుపెట్టి మీ ఆదాయం మరింత రెట్టింపు పొందవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

కేవలం రూ. 850 కే లభించే మిషన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.  ముఖ్యంగా లాభాలు ప్రారంభమయ్యే కొద్దీ వ్యాపారాన్ని విస్తరించి లాభాలను మరింత ఎక్కువ అందుకోవచ్చు. అయితే మిషన్ పై మాత్రమే కాకుండా ముడి పదార్థాలపై కూడా కొంచెం ఖర్చు చేయాల్సి ఉంటుంది.. తొలి దశలో రూ.200 లోపే ముడి సరుకులు కొనుగోలు చేయండి. ఆన్లైన్లో ఈ యంత్రాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు.  మీరు వాటిని ఏదైనా టేబుల్ పై ఉంచి చిప్స్ ను సులభంగా కత్తిరించవచ్చు.ముఖ్యంగా ఈ మిషన్ ఎక్కువ స్థలాన్ని కూడా తీసుకోదు. కరెంటు కూడా అవసరం లేదు.  ప్రస్తుతం ఫ్రెష్ ఫ్రైడ్ .. హాట్ చిప్స్ తినే ట్రెండు మొదలైంది . మీరు వీటిని మంచి క్వాలిటీతో రుచితో తయారు చేస్తే మీ విశ్వసనీయత పెరిగి డిమాండ్ అధికమయ్యే అవకాశం ఉంటుంది.

వ్యాపారాన్ని ఇంటిముందు చిన్న బండి లేదా స్టాల్ లో పెట్టి అమ్మడం ప్రారంభించవచ్చు. అంతేకాదు కొంతమంది దుకాణా దారులతో కూడా మీరు మాట్లాడుకొని మీ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకోవచ్చు.  బంగాళదుంప చిప్స్ ఆదాయం ఖర్చు కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ కోసం ఫ్రీగా సోషల్ మీడియాని వాడుకోవచ్చు.  ఇలా బంగాళదుంప చిప్స్ తయారు చేస్తూ తక్కువ ఖర్చు తో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: