మనీ: రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే ప్రతి నెల రూ.3000 జమ..!
అదే 30 సంవత్సరాలు నిండిన రైతులు ఈ పథకంలో చేరితే రూ.110 డిపాజిట్ చేయాలి. 40 యేళ్లు వాళ్ళు అయితే ₹200 కి పెరుగుతుంది. రైతుకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందవచ్చు. మీ సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి ఇన్కమ్ సర్టిఫికెట్, భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. మీ అకౌంట్లో డబ్బు జమ కావాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని కూడా అందివాల్సి ఉంటుంది. ఇక తర్వాత దరఖాస్తు ఫారంపై ఆధార్ కార్డుతో లింకు చేయించాలి. ఇక అప్పుడు మీకు పెన్షన్ అకౌంట్ నెంబర్ ఇస్తారు . ఈ పథకాన్ని పొందేందుకు మీరు ఆన్లైన్ రిజిస్టర్ కూడా చేయవచ్చు.
మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి..maandhan.in కి వెళ్లి అక్కడ మీరే నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్, ఓటిపి సమాచారం ఎంటర్ చేసి పెన్షన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు . ఇలా రైతులు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.