మనీ: కొత్త సంవత్సరం ఇలా చేసి అధిక లాభాలు పొందండి..!
మీరు కూడా ఈమె లాగే కేకుల తయారీ మొదలుపెట్టి డబ్బులు సంపాదించవచ్చు. మీరు కావాలంటే వాట్స్అప్ గ్రూప్ వంటివి క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో మంచిగా డబ్బులు వస్తాయి. రకరకాల ఫ్లేవర్లలో కేకులను తయారు చేయవచ్చు. ఈమెకి కూడా నెలకు 200 కేకుల ఆర్డర్లు వస్తున్నాయట . దీంతో బాగా డబ్బు సంపాదిస్తున్నానని కూడా చెబుతోంది ఆ మహిళ. పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని మొదలుకొని ప్రతి చిన్న విషయానికి కేకు కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే .ఇక త్వరలోనే న్యూ ఇయర్ రాబోతున్న నేపథ్యంలో ఈ కేకులు చాలా బాగా అమ్ముడుపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతారు. దీనినే మీరు ఆదాయంగా మలుచుకోవచ్చు.
మీరు కూడా ఇలా కేకుల వ్యాపారంతో మరింత లాభం పొందే విధంగా ఇప్పటినుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మంచిది . మరో రెండు నెలల సమయం ఉంది కాబట్టి బేకరీ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉంటే న్యూ ఇయర్ రాగానే మీరు మీ పని మొదలు పెట్టవచ్చు. అప్పుడు ఊహించని విధంగా లాభాలు వస్తాయి..