మనీ: రైతులకు శుభవార్త.. ఖాతాలో డబ్బు జమ..!

Divya
దీపావళి పండుగ కు రైతులందరికీ కేంద్రం తీపి కబురు అందించింది. రైతులకు ప్రధాన నరేంద్ర మోడీ ఇస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి. ఇక రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలను ఈ స్కీం ద్వారా ఉచితంగా అందిస్తోంది. అయితే రైతుల ఖాతాల్లోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలు భూములు ఉండి, సరైన పంటలు పండక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే 4 నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున 12 నెలల్లో 6000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

ఇక ఈ క్రమంలోని మరొకసారి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు పీఎం కిసాన్ పథకం కింద 12వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇక రైతులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ డబ్బుల కోసం కేంద్ర ప్రభుత్వం అసలు విషయాన్ని తెలిపే వారికి సంతోషాన్ని కలిగించింది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన పిఎం కిసాన్ సమ్మన్ సమ్మేళన 2022 సదస్సును సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు.  ఈ సమావేశం వేదికగా ప్రధాన మోడీ రైతులకు రావలసిన పన్నెండవ విడత కిసాన్ సమ్మాన్ స్కీం నిధుల పంపిణీ ప్రారంభిస్తారు.
వెంటనే ఈ పథకం కింద లబ్ధిదారుల రైతులందరి ఖాతాలలోకి నగదు బదిలీ అవుతుంది. మరొక ఆనందించే విషయం ఏమిటంటే.. రేపటి నుంచే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి.  ఇక దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి రైతుల కోసం ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక రైతులు కూడా మీ ఖాతాలో పడిన డబ్బులను చెక్ చేసుకొని విత్డ్రా చేసు కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: