మనీ: ఇలా చేస్తే రైతులకు అదిరిపోయే లాభాలు..!!

Divya
ప్రస్తుతం రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయంలో నష్టపోతున్నారని విషయం చాలామందికి తెలుసు. కానీ వ్యవసాయంలో కొన్ని మెళుకువలు తెలుసుకుంటే కచ్చితంగా ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాదు లక్షల్లో కళ్ళు చెదిరే లాభాలను పొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా ..ఇక ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలోకి వస్తున్న యువత సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ముఖ్యంగా కొత్త కొత్త పంటలను సాగు చేయడమే కాదు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు కూడా.. మీరు కూడా వ్యవసాయం చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అనుకుంటే దోస సాగు ప్రారంభించవచ్చు.
ఉత్తరప్రదేశ్లోని ఒక రైతు తన పొలంలో దోసకాయలను పండించి.. కేవలం నాలుగు నెలల్లోనే 8 లక్షల రూపాయలు సంపాదించాడు. ఇక ఇందుకోసం నెదర్లాండ్స్ నుంచి దోసకాయ విత్తనాన్ని తెప్పించి తన చేనులో ఆయన నాటడం జరిగింది. ఇక ఈ దోసకాయలలో విత్తనాలు అస్సలు ఉండవు. కాబట్టి రెస్టారెంట్లు హోటల్ నుంచి ఇటువంటి దోసకాయలను భారీ డిమాండ్ తో కొనుగోలు చేస్తున్నారు. మిగతా దోసకాయల కంటే ఈ దోసకాయలకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో చాలామంది ఇలా ఈ దోస సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే ఈ వ్యాపారం కోసం ఆ రైతు ప్రభుత్వం నుంచి 18 లక్షల రూపాయల గ్రాంట్ తీసుకొని పొలంలో ఒక షెడ్డు నెట్ హౌస్ నిర్మించారు.
ముఖ్యంగా దోసకాయ పంట నాలుగు నెలల్లోని చేతికి వస్తుంది. ముఖ్యంగా ఈ పంట వేయడానికి మీ భూమి యొక్క సాంద్రత పిహెచ్ వాల్యూ 5.5 నుండి 6.8 వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అప్పుడు భూమి మంచిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పంట మీరు వేసినట్లయితే లక్షల్లో లాభం కచ్చితంగా వస్తుంది ఇక నాలుగు నెలల్లోనే 8 లక్షల ఆదాయం అంటే ఇక మీరు ఏ రేంజ్ లో సంపాదించవచ్చో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: