ఇందులో 417 ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు!

Purushottham Vinay
పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం మీరు కోటీశ్వరుడయ్యే అవకాశాన్ని ఈజీగా కల్పిస్తోంది. ఇందుకోసం మీరు ప్రతిరోజూ కూడా రూ.417 ఇన్వెస్ట్ చేస్తే చాలు.ఇక ఈ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి వచ్చేసి 15 సంవత్సరాలు అయినప్పటికీ మీరు దానిని 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పొడిగించవచ్చు.అలాగే దీంతో పాటు పన్ను ప్రయోజనం కూడా పొందుతారు. ఇక ఈ ప్లాన్‌లో ఏటా 7.1 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. ఇది మీకు ప్రతి సంవత్సరం కూడా చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకం మిమ్మల్ని ఎలా కోటీశ్వరుడిని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఒక 15 సంవత్సరాల పాటు అంటే మెచ్యూరిటీ వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు అంటే నెలలో రూ. 12500 రూపాయలు అంటే రోజుకి రూ. 417 రూపాయలు ఇందులో డిపాజిట్‌ చేయాలి. ఇక ఈ మొత్తం పెట్టుబడి 22.50 లక్షలు అవుతుంది.ఇక మెచ్యూరిటీ సమయంలో మీరు 7.1 శాతం వార్షిక వడ్డీతో కాంపౌండింగ్ ప్రయోజనం అనేది పొందుతారు. వడ్డీగా మీకు రూ.18.18 లక్షలు లభిస్తాయి. అంటే మొత్తం 40.68 లక్షల రూపాయలు మీకు లభిస్తాయి.


ఇక ఇందులో మీరు కోటీశ్వరుడు కావాలంటే 15 సంవత్సరాల తర్వాత వచ్చిన మొత్తాన్ని మీరు రెండుసార్లు అంటే 5 సంవత్సరాల చొప్పున మీరు రెండు సార్లు పెట్టుబడి పెట్టాలి.ఇక సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ మొత్తం పెట్టుబడి మొత్తం రూ. 37.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మీరు 7.1 శాతం వడ్డీ రేటుతో రూ. 65.58 లక్షలు డబ్బులు పొందుతారు. అంటే 25 ఏళ్ల తర్వాత మీ మొత్తం ఫండ్ వచ్చేసి 1.03 కోట్లు అవుతుంది.జీతం పొందేవారు ఇంకా స్వయం ఉపాధి పొందేవారు అలాగే పెన్షనర్లు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్‌ ఖాతాని ఓపెన్ చేయవచ్చు.అయితే ఒక వ్యక్తి ఒక ఖాతాను మాత్రమే ఓపెన్‌ చేయగలడు. ఇందులో జాయింట్‌ ఖాతా అనేది ఉండదు.ఇక పిల్లల తరపున తల్లిదండ్రులు/సంరక్షకులు పోస్టాఫీసులో ఈ మైనర్ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ప్రవాస భారతీయులు అయితే ఇందులో ఖాతా తెరవలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: