మనీ: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.. ఎలా అంటే..?

Divya
పేదవాడి కలపగా భావించే వెదురు ద్వారా అనేక లాభాలను మనం పొందవచ్చు.  ముఖ్యంగా పచ్చబంగారం గా పిలుచుకునే ఈ పంట సిరుల పంట పండిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇతర మొక్కలతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సత్తా ఈ మొక్కలకు ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక పోతే అటవీ ప్రాంతానికే పరిమితమైన ఈ పంటను మైదాన ప్రాంతాల్లో కూడా సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తూ వారికి సబ్సిడీ కూడా ఇస్తోంది. ఇక ఒకసారి నాటితే సుమారుగా 70 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడి లభిస్తుంది. సుమారుగా 60 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్కలు రకాలను బట్టి నాటిన మూడు లేదా నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 30 టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది.
అయితే పంట పెట్టేటప్పుడు మొదటి సంవత్సరం ఎకరాకు 60 వేల వరకు పెట్టుబడి అవుతుంది . ఇక ఆ తర్వాత పది వేల రూపాయల ఖర్చు చేస్తే చాలు. రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఇకపోతే వెదురులో  140కి పైగా రకాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతానికి,  భూమికి , మార్కెట్  కి అనువైన వెదురు మొక్కలను ఎంచుకోవాలి.  ఇక మార్కెట్లో డిమాండ్ ఉన్నవి కేవలం 14 రకాలే కాబట్టి వెదురు సాగు ప్రోత్సహించడం వల్ల భూమి కూడా సారవంతం అవుతుంది. ఇక సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
బీడు భూములతో పాటు పొలం గట్ల మీద , పంట చుట్టూ కంచె రూపంలో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఇక వెదురు మొక్కలు నాటిన తరువాత ఒక్కొక్క మొక్కకు మూడు సంవత్సరాల పాటు 240 రూపాయల వరకూ ఖర్చవుతుంది. ఇక ప్రైవేటు భూముల్లో సాగు చేసే వారికి 50 శాతం సబ్సిడీ.. ప్రభుత్వ భూముల్లో సాగు చేసే వారికి వంద శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇకపోతే మొదటి ఏడాది 50శాతం, రెండవ ఏడాది 30 శాతం ,  మూడో ఏడాది 20 శాతం చొప్పున సబ్సిడీ కూడా అందిస్తారు. ఇప్పటికే కొన్ని లక్షల లో పెద్ద నర్సరీలను ఏర్పాటు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.శ్రమ తక్కువ పెట్టుబడి కూడా ఉండదు లాభాలు ఎక్కువగా అందించే ఈ పంటను మీరు కూడా సాగు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: