మనీ: రైతులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఉండే పేద అట్టడుగు వర్గాల ప్రజలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొకుండా వారు కష్టపడకుండానే వారి ఖాతాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 10 వేల కంటే పైగానే జగన్ ప్రభుత్వం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక స్కూల్ కి పిల్లలు కచ్చితంగా వెళ్లాలని కాన్సెప్టుతో పిల్లల చదువులకు కూడా ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలను అందిస్తూ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఉండే ఏ ఒక్కరికి కూడా కష్టాలు రాకూడదని ఆలోచనలోనే జగన్ ప్రభుత్వం చేస్తున్న పని తీరుకు అందరు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
దేశానికి వెన్నెముక లాంటి రైతులకు కూడా జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త శుభవార్తను తీసుకొస్తూ రైతుల మోములో సంతోషాన్ని చూస్తున్నారు. ఇకపోతే తాజాగా మరొకసారి రైతులకు వైయస్ జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక శుభవార్త ను తీసుకు వచ్చింది. ముఖ్యంగా రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు పండించిన పప్పు ధాన్యాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తామని వైయస్ జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. చాలా మంది రైతులు పప్పు ధాన్యాలను పండించి ఇంటికి తీసుకు వచ్చిన వేళ మొదటి నెలలో మద్దతు ధర  లేకపోవడంతో ఇంట్లోనే వాటిని నిల్వ చేసుకున్నారు.
అందుకే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ధాన్యాలను కొనుగోలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల తో వెల్లడించింది ముఖ్యంగా పెసలు మినుములు తో పాటు ఇతర పప్పు ధాన్యాలను కూడా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని జగన్ ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే రబీ సీజన్కు సంబంధించి రాష్ట్రంలో 1,26,270 కన్నుల శనగ లను , 91,475 టన్నుల మినుములను, 19,632 టన్నుల ప్రజలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక పప్పు ధాన్యాలు లకు మద్దతు ధరను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ప్రతి క్వింటాల్ పెసలకు రూ.7,275 , క్వింటాల్ శనగలకు రూ.5,230 అలాగే కందులు మినుములు క్వింటాలుకు రూ.6,300 మద్దతు ధర ప్రకటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: