మనీ: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!!

Divya
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పెన్షన్ స్కీమ్ కింద చందాదారులకు చెల్లించే ₹1000 చాలా తక్కువని ఇటీవల పార్లమెంట్ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఇకపోతే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ప్రాతిపదికన కార్మిక మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకెళ్లడం ఎంతో అవసరం ఉంటుంది అని పార్లమెంట్ కమిటీ భావించింది. ఇక వీరి నిర్ణయం వల్ల సుమారుగా ఏడు కోట్ల మంది పిఎఫ్ ఖాతాదారులకు లబ్ది జరగబోతోంది 2022 - 23 గ్రాంట్ల డిమాండ్ పై పార్లమెంటులో సమర్పించిన నివేదికలో ఇటీవల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ..8 సంవత్సరాల క్రితం నిర్ణయించిన వెయ్యి రూపాయల నెలవారి పెన్షన్ ఇప్పుడు చాలా తక్కువగా ఉందని పేర్కొనడం జరిగింది.

పార్లమెంటరీ కమిటీ ప్రకారం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో మార్పులు చేయడం చాలా అవసరం అనిపించింది. అంటే కనీస పెన్షన్ రూ. రెండు వేలకు పైగా పెంచాలని ఈపీఎఫ్ అన్ని పెన్షన్ పథకాలను నిపుణుల ద్వారా మూల్యాంకనం చేయించాలని సమాచారం. తర్వాత నెలవారి సభ్యుల పెన్షన్ ను తగిన మేరకు పెంచవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఉద్యోగుల పెన్షన్ స్కీం ప్రకారం 1995 ని మూల్యాంకనం చేయడానికి 2018 సంవత్సరంలో కార్మిక మంత్రిత్వ శాఖ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందులో సభ్యులు, వితంతు పింఛన్ దారులకు కనీస నెలవారి పెన్షన్ సుమారుగా రూ.రెండు వేలకు పైగా ఇవ్వాలి అని కమిటీలో సిఫార్సు చేయడం జరిగింది. ఇక ఇందుకు అవసరమైన వార్షిక బడ్జెట్ కేటాయింపులు కూడా చేయాలి అని సూచించింది. అయితే నెలవారి పింఛన్ వెయ్యి రూపాయల నుంచి పెంచడానికి ఆర్థికశాఖ ఏమాత్రం అంగీకరించడం లేదు కానీ పార్లమెంటరీ కమిటీ ప్రకారం చాలా కమిటీలు దీనిపై వివరంగా చర్చించాయి త్వరలోనే కనీసం రూ.2 వేలకు పైగా పెన్షన్ దారులకు లభించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి .. ఇకపోతే కచ్చితంగా దీనిని అమలులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: