మనీ: ఈ స్కీంతో మీ సొంత ఇంటి కల నెరవేరినట్లే..!!

Divya
దేశంలో నిరాశ్రయులుగా ఉన్న ఎంతోమంది సొంతింటి కలను సహకారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. అయితే అలాంటి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం. 2022 సంవత్సరం నాటికి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు అలాగే ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాల వారి కోసం రెండు కోట్ల గృహాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం.
భారతదేశంలోని మహిళలకు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. గిరిజనులు , ఆదివాసులు వంటి నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు పట్టణ ప్రాంతాలలో సరసమైన గృహాలను పొందుతారు అని స్పష్టం చేయడం జరిగింది. అంతే కాదు ఈ పథకంలో భాగంగా ప్రజలు హోమ్ లోన్ పొందే అవకాశాలుంటాయి.. గృహ రుణాలపై భారత ప్రభుత్వం వడ్డీ రాయితీని కూడా అందిస్తోంది. ఇకపోతే సబ్సిడీ వడ్డీ రేటు సంవత్సరానికి 6.50%గా పరిగణించబడింది. ఇక లబ్ధిదారుల అందరికీ కూడా 20 సంవత్సరాల వరకు లోన్ గడువును ఇస్తూ ఈ వడ్డీని సబ్సిడీ కింద ఆఫర్ చేయడం గమనార్హం.
సబ్సిడీ కింద సుమారుగా రూ.2.5 లక్షల వరకు ఆదా చేసుకునే వీలుంటుంది. ఇక ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు నిర్మించాలి అనుకునే వారి లో సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ప్రాధాన్యం ఇస్తారు ఇక మహిళల పేరుతో ఇంటి నిర్మాణానికి ఈ పథకాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేకాదు ఆధునిక సాంకేతికతతో ఇళ్లను నిర్మించడంతో పాటు సుస్థిరమైన పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. గరిష్టంగా రూ. 9 లక్షల వరకు హోమ్ లోన్ పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: