మనీ: బ్యాంకు ఖాతాదారులకు ఆరోజే డెడ్ లైన్.. పాటించకపోతే రూ. 10 వేలు జరిమానా..!!

Divya
ప్రతి సంవత్సరం మార్చి నెల చివరి లోపు కొన్ని పనులు తప్పకుండా పూర్తి చేయాలి. ముఖ్యంగా బ్యాంకు కస్టమర్లు.. పన్ను చెల్లింపుదారులు కొన్నింటిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి . లేదంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.. మీరు కూడా బ్యాంకులలో ఖాతా కలిగి ఉండటం.. మీరు కూడా పన్నులు చెల్లిస్తూ ఉన్నట్లయితే.. కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక మార్చి నెల చివరి లోపు కొన్ని పనులను పూర్తి చేయాలి. లేకపోతే 10 వేల రూపాయల జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే మార్చి చివరి నెలలో ఏ ఏ డెడ్ లైన్స్ ఉన్నాయో తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక నష్టపోతారు.

పన్ను ఆదా చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ మార్చి నెల మాత్రమే సమయం మిగులుతుంది.. అంటే మీ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లో మార్చి 31 లోపు డబ్బులు పెడితే.. కాబట్టి మీరు ఇంకా డబ్బులు చెల్లించకపోతే వెంటనే డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల 2021- 22 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఇక పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఖచ్చితంగా లింకు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గడువు కూడా మార్చి 31తో ఉంది. కాబట్టి మీరు కూడా ఇంకా మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయకపోతే వెంటనే ఆ పనిని పూర్తి చేసేయండి. లేదంటే పాన్ కార్డు చెల్లుబాటు కాకపోగా బ్యాంకు సేవలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 272 b ప్రకారం మీకు 10 వేల రూపాయల వరకు జరిమానా కూడా పడవచ్చు.
ఇక బ్యాంకు కస్టమర్లు కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి దీనికి కూడా మార్చి 31వ తారీకు చివరి గడువు. కేవైసీ అప్డేట్ చేయకపోతే బ్యాంకు సేవలకు అంతరాయం వాటిల్లుతోంది ఒక్కోసారి ఖాతా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇక ఇన్కమ్ టాక్స్ నిబంధనల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను కనీసం పది వేలు ఉంటే మీరు ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. నాలుగు ఇన్స్టాల్మెంట్ లో ఈ పనిని పూర్తి చేయాలి. చివరి ఇన్స్టాల్మెంట్ కు డెడ్ లైన్ మార్చి 15వ తేదీన ముగియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: