మనీ: కేవలం రూ.70 వేలతో లక్షల్లో ఆదాయం..?

Divya
ఈ మధ్య కాలంలో చాలా మంది ఒకడి కింద బ్రతకడం ఇష్టం లేక స్వతహాగా వ్యాపారాలను చేసుకోవాలని ముందుకు వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక వ్యాపారాన్ని లక్ష రూపాయల లోపు పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇందుకు ప్రభుత్వం కూడా సహాయాన్ని అందిస్తుంది. లక్ష రూపాయల లోపు పెట్టుబడి పెట్టి.. వ్యాపారాలు చేయాలి అనుకుంటే అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఇక అలాంటి వాటిలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ కూడా ఒకటి. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్ కి మనం సప్లై చేయవచ్చు. ముఖ్యంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న వారికి కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వ్యాపారులకు 30 శాతం సబ్సిడీని కూడా అందివ్వడం జరుగుతుంది.

సబ్సిడీ లేకుండా రూట్ ఆఫ్ సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేస్తే గనుక మనకు లక్ష రూపాయలు ఖర్చవుతుంది. ఇక అందుకే 30 శాతం సబ్సిడీని పొందవచ్చు అంటే 30 వేల రూపాయల వరకు సబ్సిడీ రూపంలో తీసుకోవచ్చు అన్నమాట. ఇక పెట్టుబడి విషయానికి వస్తే కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మనకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. వేర్వేరు రాష్ట్రాలలో ఖర్చు కూడా వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సబ్సిడీ మినహాయించిన తర్వాత కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మనకు 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సబ్సిడీ ఇవ్వడం గమనార్హం.. అంతేకాదు బ్యాంకులు వీరికి లోను కూడా ఇస్తాయి.
వ్యాపారంలో సోలార్ ప్యానల్స్ జీవితకాలం 25 సంవత్సరాలు.. ఇక పది సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మారిస్తే సరిపోతుంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ.  నెలకు రూ.30 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.  పూర్తి వివరాలు కావాలంటే పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి లేదా వెబ్ సైట్ నుంచి కూడా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: