మనీ: ఫీజు రీయింబర్స్మెంట్ పొందే వారికి శుభవార్త..!!

Divya
దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు విద్యార్థులకు ఒక శుభవార్త కలిగించాయని చెప్పవచ్చు. అది ఏవిధంగా అంటే ఎస్సీ విద్యార్థులకు అందే ఉపకార వేతనాలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని విద్యా సంస్థలకు నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఇలా చేసినప్పుడే కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది..
విద్యార్థులకు ఈ మేరకు కచ్చితమైన హామీ ఇస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం .. ఇక నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు.. ఉపకారవేతనాలు.. ఇలా అన్ని పథకాలకు సంబంధించి విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని ఇకపై వారి ఖాతాల్లో నేరుగా జమ  చేయనున్నట్లు సమాచారం.. ఇప్పటివరకు విద్యార్థి ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విద్యార్థి పేరు మీద కాలేజీ యాజమాన్యం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించే ఈ పద్ధతులే విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రం ఇదే పద్ధతిని పాటిస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడానికి కేంద్ర సామాజిక న్యాయం.. సాధికారత శాఖ ఒప్పుకోవడం లేదు.. అందుకే ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు నేరుగా విద్యార్థి ఖాతాలోకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దళిత వర్గాల పిల్లలకు ఆర్థిక ఇబ్బంది ఉండకపోగా ఆర్థికంగా సహాయం కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లదు అని చెప్పవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను పాటిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: