మనీ: ఎన్నడూ లేని విధంగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్..డబ్బు కూడా ఆదా..?
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ కాల్స్, 5 GB డేటా.. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా మనకు అందుతాయి. అంతేకాదు మ్యూజిక్ ని కూడా మనం ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లిమిటెడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు ఎనభై నాలుగు రోజుల పాటు ఈ ప్లాన్ వాలిడిటీ అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ఇంత తక్కువ ధరకే ఇన్ని ఆఫర్లు కల్పించే మరొక టెలికామ్ సంస్థ లేదని బిఎస్ఎన్ఎల్ చెబుతోంది.
ఇక మరికొన్ని దీర్ఘకాలిక ప్లాన్ల వివరాలు విషయానికి వస్తే..
మొదటి ప్లాన్ రూ.1,999..
365 రోజులు వ్యాలిడిటీ తోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. అంతే కాదు సంవత్సరం పొడవునా
600 జీబీ డేటా ను పొందవచ్చు. ఇక ఎస్ఎంఎస్లు రోజుకు 100..ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, 60 రోజుల వరకు వావ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ అలాగే ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
ఇక రెండవ ప్లాన్ విషయానికి వస్థే.. రూ.2,399..
425 రోజుల అపరిమిత కాల్స్..అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్..డేటా- రోజూ 3జీబీ
ఎస్ఎంఎస్లు- రోజూ 100 తో పాటు ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌ను కూడా మనం పొందవచ్చు. అంతే కాదు ఇలాంటి ప్లాన్స్.. ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఆఫర్లు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బిఎస్ఎన్ఎల్ కు షిఫ్ట్ అవుతారని ఆలోచనతో ప్రభుత్వ టెలికాం రంగం ఇలా మార్చినట్లు తెలుస్తోంది.