మనీ : రూ.7 పొదుపుతో రూ.60 వేలు బెనిఫిట్..ఎలా అంటే..?

Divya
ప్రతి నెల భవిష్యత్తులో పెన్షన్ పొందాలని మీరు కూడా భావిస్తున్నట్లు అయితే ఇప్పటి నుంచి ప్రతిరోజు కొంత డబ్బును ఆదా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చక్కగా పెన్షన్ రూపంలో ప్రతి నెల కూడా కొంత మొత్తంలో డబ్బులు పొందవచ్చు. అయితే మీరు ప్రతి నెల చివర్లో ఎంత మొత్తం పొందాలి అని అనుకుంటున్నారో అది మీరు ప్రతిరోజు ఆదా చేసే ప్రాతిపదిక మీద ఆధారపడి ఉంటుంది. ఇక మీరు ప్రతి నెల పెన్షన్ పొందాలని భావిస్తూ ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ లేకుండా ప్రతి నెల డబ్బులు మీరు పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో  రకాల పథకాలను అందిస్తోంది కాబట్టి అందులో పెన్షన్ పథకాలు కూడా చాలానే ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ప్లాన్ లను ఎంచుకుని ప్రతి రోజు ఆదా చేయడం వల్ల  సులభంగా పెన్షన్లు రూపంలో డబ్బులు పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత డబ్బు పరంగా ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో కొన్ని వేల మంది ఈ పెన్షన్ పథకాలలో చేరుతూ ఉన్నారు. మీరు కూడా ఇలాంటి స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి పదవీ విరమణ తర్వాత కూడా సంతోషంగా జీవించవచ్చు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకంలో డబ్బులు ఇవ్వడం వల్ల ఆర్థిక భరోసా ఉంటుంది.. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్ డీఏ నిర్వహణను చూసుకుంటుంది. ఇక మీరు కూడా ఈ పథకంలో చేరాలనుకుంటే కనీస వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆ వ్యక్తి జీవించినంతకాలం డబ్బులు వస్తూనే ఉంటాయి . కాబట్టి భాగస్వామికి కూడా డబ్బులను అందిస్తారు. కాబట్టి మీరు ప్రతి నెల రూ.42 నుంచి రూ.1454 వరకు ఇన్వెస్ట్ చేయడం వల్ల వెయ్యి రూపాయల నుంచి రూ.ఐదు వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: