మనీ:డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా..?

Divya
ఎవరైనా సరే డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి వస్తుందా..? ఎటువంటి వాటిలో రిస్క్ ఉండదు..? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి..? ఎలా ఇన్వెస్ట్ చేయాలి ..?ఎంత ఇన్వెస్ట్ చేయాలి ..? అని ప్రతి విషయంలో కూడా సందేహాలను వ్యక్తపరుస్తూ ఇదేవిధంగా ఆలోచిస్తూ ఉండటం సహజం. అయితే ప్రస్తుతం ఎందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇలా ఎందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు లాభాలు ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి.

ముఖ్యంగా మనకి డబ్బులు దాచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. ఎంచుకొనే ఆప్షన్ ప్రాతిపదికన మీద కూడా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. చాలామంది ఎల్ఐసి పాలసీ తీసుకుంటూ ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎల్ ఐ సీ పాలసీల వల్ల  మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం రావడంతో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే పాలసీలను తీసుకోవడానికి చాలామంది మొగ్గుచూపుతారు.
మరికొంతమంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఇందులో ప్రతినెల కొంత మొత్తంలో డిపాజిట్ చేయడం వల్ల మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తాన్ని పొందడంతో పాటు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది అందుకే మరికొంతమంది పీ పీ ఎఫ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రెండు కూడా బెస్ట్ ప్రయోజనాలను అందిస్తున్నాయి కాబట్టి పీపీఎఫ్ స్కీమ్ లో డబ్బులు ఇన్వైట్ చేయాలా..?  లేక ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు..

మీ కుటుంబంలో మీపై చాలా మంది ఆధారపడి ఉన్నారు అని కనుక మీరు అనుకున్నట్లు అయితే వెంటనే ఎల్ఐసి పాలసీ తీసుకోండి.. లేదు నాకు ఎక్కువ మొత్తంలో రాబడి కావాలి అని ఆలోచిస్తే పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఇక ఎల్ఐసి పాలసీ లో మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.. పీపీఎఫ్ లో అధిక రాబడి లభిస్తుంది.. కాబట్టి మీ అవసరానికి తగ్గట్టుగా ఈ రెండింటిలో మంచి ఆప్షన్ ని మీరే ఎంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: