మనీ: మహిళలకు తీపికబురును అందించిన మోడీ ప్రభుత్వం..!

Divya
మహిళలను అన్ని రంగాలలో ముందుండేలా చేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలను చేస్తోంది. ఇక మన భారతదేశంలో మహిళల వ్యాపార భాగస్వామ్యం కేవలం 8 శాతమే ఉండడం బాధాకరమని కేంద్ర ప్రభుత్వం సూచించింది. నిజం చెప్పాలంటే బ్యాంకులు కూడా ఎక్కువగా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడానికి పురుషులను మాత్రమే ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అందుకే వ్యాపార రంగంలో మహిళలు ముందడుగు వేయలేకపోతున్నారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాల ద్వారా మహిళలు కూడా అభివృద్ధిలో ముందడుగు వేయవచ్చు అని సమాచారం.

స్త్రీ శక్తి ప్యాకేజీ :
మహిళలు చిన్న , మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి రూ.50 వేల నుండి రూ.2 లక్షల వరకు లోన్ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ ఎంఎస్ఎంఈ లో నమోదు చేసుకున్న కంపెనీలకు ఏకంగా రూ.50 వేల నుంచి 25 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు. కానీ ఐదు లక్షల రూపాయల వరకు ఎటువంటి డాక్యుమెంట్ ను సమర్పించాల్సిన పని లేదు. కాబట్టి మహిళలు స్త్రీ శక్తి ప్యాకేజీ కింద లోన్ పొందాలి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను సంప్రదించవచ్చు.

అన్నపూర్ణ యోజన :
మహిళలు ఫుడ్ వ్యాపారం చేసుకోవడానికి ఈ పథకం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ అందిస్తుంది. అంటే మీరు ఈ పథకం కింద 50 వేల రూపాయల వరకు పొందవచ్చు. గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి , ఫ్రిడ్జ్, మిక్సర్ గ్రైండర్, వంటకు కావలసిన పదార్థాలు, డైనింగ్ టేబుల్ , వంట పాత్రలు లాంటివి కొనుగోలు చేయడానికి ఈ పథకం బాగా పనికొస్తుంది. అయితే ఇందుకు గ్యారెంటీ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. 36 నెలల్లో  పూర్తి మొత్తాన్ని తీర్చి వేయాలి.
ఇక వీటితో పాటు ముద్ర యోజన , ఉమెన్ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ , మహిళా సమృద్ధి యోజన వంటి పథకాల ద్వారా మహిళలు సులభంగా లోన్ పొందడం తోపాటు వ్యాపారాభివృద్ధి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: