మనీ : వీధి వ్యాపారులకు అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం.. సాయం ఎంతంటే..?

Divya
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే నేపథ్యంలోని ఇప్పుడు సరికొత్తగా వీధి వ్యాపారులకు కూడా అండగా నిలవాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా వీధి వ్యాపారుల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది.. అందుకే వీరిని దృష్టిలో పెట్టుకొని వీరికి సరైన సహాయం అందించాలని ఆలోచిస్తోంది. ఇక అందరి కోసం పథకాలను ప్రవేశ పెట్టినట్లు గానే ఇప్పుడు వీధి వ్యాపారుల కోసం కూడా సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ పథకం చాలా ఉపయోగపడుతుందట.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు  పీఎం  స్వనిధి పథకం కూడా ఒకటి. 2020 జూన్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది.ఇక వ్యాపారస్తులు రుణాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. వ్యాపారుల కోసమే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు కాబట్టి వారు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం దీని ద్వారా రుణం పొందవచ్చు. అంతేకాదు ఈ పథకం యొక్క గడువు కేవలం 2022 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అర్హులైన వారు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ పథకం కింద పదివేల రూపాయలను అందిస్తూ ఉండగా, ప్రస్తుతం దీనిని 20 వేల రూపాయలకు పొడిగించారు.

అంతేకాదు తీసుకున్న రుణాన్ని  సరైన సమయంలో చెల్లించినట్లైతే వడ్డీ రాయితీ కూడా ఉంటుందట. ఇక ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఏడు శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. మరొక అవకాశం ఏమిటంటే రుణాన్ని .. విధించిన గడువు లోపు చెల్లిస్తే రెండవసారి రుణం కూడా తీసుకోవచ్చు. ఇక రుణం పొందాలని అనుకునేవారు స్వనిధి వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఎవరెవరు అర్హులు అనగా 2020 , 24 వ తేదీ లేదా అంతకంటే ముందే ఎలాంటి రుణాలను పెండింగ్లో ఉంచుకోకుండా ఉండాలి. అలాంటి వారు ఈ పథకంలో ఋణం పొందవచ్చు.
మీరు ఈ  వెబ్‌సైట్ pmsvanidhi.mohua.gov.in ద్వారా లోన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: