డబ్బులను ఇన్వెస్ట్ చేసే బెస్ట్ సీన్స్ ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా డబ్బులను ఇన్వెష్ట్ చేసుకోవడానికి రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎందులో డబ్బులు పెట్టాలో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకు ఉపయోగపడే స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీం ద్వారా మంచి లాభాలను పొందడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాలను సొంతం చేసుకోవచ్చు.
1.MIS స్కీం :
ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి లాభాలు వస్తాయి. ఈ పథకంలో 7.8 శాతం వడ్డీ లభించడంతో పాటు వెయ్యి రూపాయల నుంచి కూడా పెట్టుబడి పెట్టడంతో పాటు ఎమ్. ఐ. ఎస్ స్కీం  లో పెట్టుబడిగా పెట్టవచ్చు.

2. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
ఈ పథకంలో వెయ్యి రూపాయల నుంచి మనము సుమారుగా 15 లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా కూడా మనకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరవచ్చు.
3. రికరింగ్ డిపాజిట్:
పోస్ట్ ఆఫీస్ లో ప్రవేశపెట్టే రికరింగ్ డిపాజిట్ ద్వారా మీకు 5.6 శాతం వడ్డీ లభిస్తోంది. అంటే మీరు ఈ స్కీమ్లో కేవలం వంద రూపాయల నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు.
4. టైమ్ డిపాజిట్:
ఈ పథకంలో చేరాలి అంటే దగ్గరలో ఉన్న పోస్టాఫీసు కెళ్ళి చేరవచ్చు. ఇందులో ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఖాతాలో డబ్బులు ఇన్వెష్ట్ చేయాల్సి ఉంటుంది.. ఇక అంతే కాదు 5.5 శాతం నుండి 7.8 శాతం వరకు కూడా లభిస్తుంది.
5. న్యూ జీవన్ శాంతి డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ :
ఈ పథకంలో చేరడం వల్ల రిటైర్మెంట్ తర్వాత డబ్బులను నెలవారీగా పొందవచ్చు. పెన్షన్లు రూపంలో మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ముందుగానే మూడు నెలలకొకసారి ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకం లో చేరాలంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున చెల్లించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: