మనీ: రైతులు ఇలా చేస్తే నెలకు రూ.5 వేలు ఉచితం..!!

Divya
రైతులకు.. అన్నదాతలకు ప్రతి విషయం పై చేదోడు వాదోడుగా వుండాలి అన్న సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ప్రతి నాలుగు నెలలకొకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 9విడతల కింద విడతకు 2000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇప్పుడు కూడా మరో విడత ను డిసెంబర్ 15 2021 నాటికి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలను జమ చేయడానికి సిద్ధంగా ఉంది.

అంటే త్వరలోనే పదవ విడత కింద రైతులు రెండు వేల రూపాయలను తమ ఖాతాల ద్వారా పొందవచ్చు అని తెలిపింది. పోతే ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న రైతులు రెండు వేల రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా అందుకున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నిధి యోజన పథకం తో పాటు రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది.

ముఖ్యంగా రైతుల  భవిష్యత్తుకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే పీఎం శ్రమ యోగి మంధన్ యోజన పథకం కింద రైతులు పెన్షన్ కూడా పొందవచ్చు.. ఇందుకోసం రైతులు ఈ పథకంలో కొంత వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.60 యేళ్లు దాటిన తర్వాత నెలవారీగా ₹3000 పెన్షన్ కింద పొందవచ్చు. ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న ఏ రైతు అయినా సరే ఈ పథకంలో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల తర్వాత మూడు వేల రూపాయలను ఖర్చు ల కోసం పెన్షన్ రూపంలో ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మీరు నెలవారీగా యాభై ఐదు రూపాయల నుంచి 200 వరకు నెలనెలా కట్టాల్సి ఉంటుంది. అంటే పీఎం కిసాన్ డబ్బులతో పాటు పెన్షన్ కింద ఐదు వేల రూపాయలను రైతులు ఉచితంగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: