మనీ: సరి కొత్త పెన్షన్ స్కీం తో ముందడుగు వేసిన కేంద్రం..!
ఆరు నుంచి ఎనిమిది నెలల కాలవ్యవధిలో ఈ సరికొత్త పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రవేశ పెట్టబోయే పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే సంబంధించిన మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సరికొత్త పథకం ఇప్పటికే ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక మీరు ప్రతినెల స్థిర రాబడిని పొందాలనుకుంటే కొంతకాలం పాటు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది.. రెండు మూడు కంపెనీలు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం..
ఇప్పటికే చాలామంది 18 సంవత్సరాల పైబడిన వారు అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరి 60 సంవత్సరాల తర్వాత ఎక్కువ మొత్తంలో రాబడి పొందాలని ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రజలు ఈ పథకాల ద్వారా లాభాలను పొందుతున్నారు. ఈ పథకం కంటే సరికొత్తగా ఇప్పుడు ప్రవేశపెట్టడం ద్వారా ఖచ్చితంగా ఒక స్థిర మొత్తంలో డబ్బులు పొందవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మనం సమీపంలో ఉన్న పోస్టాఫీసు లేదా బ్యాంకుల ద్వారా వెళ్లి ఈ పథకంలో చేరి ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇక ఈ సరికొత్త పథకాన్ని కూడా తెలుసుకోవాలంటే మరో కొన్ని నెలల పాటు ఎదురు చూడక తప్పదు.