మామూలుగా పండుగలు వస్తే దాదాపు అన్ని రంగాల వ్యాపార కంపెనీలు కస్టమర్ లను ఆకట్టుకోవడానికి మరియు వారి వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి ఎన్నో అమూల్యమైన ఆఫర్ లను ప్రవేశ పెరుగుతుంటాయి. అదే విధంగా ఇంకో వారం రోజుల్లో రానున్న విజయదశమి పండుగ సందర్భంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్ డి ఎఫ్ సి కొన్ని ఆఫర్ లను ఇస్తోంది. ఈ ఆఫర్ లు డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్, రుణాలు మరియు ఈ ఎం ఐ లు ఉన్న వారికి బాగా కలిసి రానున్నాయి. మీరు కొత్తగా ఫోన్ కొనాలన్నా, లేదా వెహికల్ లోన్ పొందాలన్నా, వ్యాపారం కోసం లోన్ పొందాలన్నా మీకు మంచి ఆఫర్లను ఈ బ్యాంక్ అందిస్తోంది.
అయితే ఈ అవకాశాన్ని కస్టమర్ లకు అందించడానికి 100 నగరాల లోని 10 వేలకు పైగా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో అమెజాన్, యాపిల్, ఎల్జీ, శామ్సంగ్, రిలయన్స్ డిజిటల్, లాంటి ప్రముఖ కంపెనీలు హెచ్ డి ఎఫ్ సి కస్టమర్ లకు ఆఫర్లు ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నాయి.
* ఈ ఎం ఐ లో మొబైల్ తీసుకునే వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ మరియు నో కాస్ట్ ఆఫర్ ఉంటుంది. ప్రధానంగా ఐఫోన్ 13 మోడల్ పైన 6000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన 22.5 శాతం గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందే వీలును కల్పించింది.
* మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే 10.25 శాతం వడ్డీకే పొందవచ్చు.
* ఒకవేళ కార్ లోన్ తీసుకుంటే 7.5 శాతం వడ్డీకే పొందగలరు.
* మరియు 75 లక్షల రూపాయల వరకు ఎవరి హామీ లేకుండా రుణం పొందే అమూల్యమైన ఆఫర్ ఉంది.
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు hdfc కస్టమర్ అయితే వెంటనే ఈ ఆఫర్ లను పొందండి.