మనీ: ఈఎస్ఐ ఖాతాదారులకు శుభవార్త..!
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పథకం లో ఉన్న వారికి ఒక శుభవార్త.. అదేమిటంటే ఇటీవల అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం లో చేరిన వారికి ఇది గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. అంటే కరోనా మహమ్మారి సమయం లో ఎంతో మంది ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా గడ్డు కాలంలో ఉండే వారిని ఆదుకుంటామని ప్రకటించింది. అయితే కేవలం ఎవరైతే ఈఎస్ఐలో భాగం పొందుతున్నారో వారికి మాత్రమే ఈ శుభవార్త అని ముందే వెల్లడించడం జరిగింది..
ఈ స్కీం ద్వారా ప్రయోజనాన్ని పొందడానికి 2020 డిసెంబర్ 31న ముగిసింది.. కానీ ఈ స్కీం గడువు పొడిగిస్తూ 2021 జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.. ఇప్పుడు కూడా ఈ గడువు ముగియడంతో దీనిని మరో 12నెలలు పొడిగిస్తూ 2022 జూన్ 30 వరకు పొడిగిస్తూ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. నిజానికి ఈ పథకాన్ని 2018వ సంవత్సరం జూలై ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే , ఈఎస్ఐ లో భాగంగా ఉన్న వారు ఒకవేళ దురదృష్టవశాత్తు ఉద్యోగాలు కోల్పోతే, వారిని ఆదుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది..
ముఖ్యంగా ఎవరైతే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో లో ఖాతా దారులుగా ఉన్నారో, వారు ఉద్యోగం కోల్పోతే, ఈ స్కీం ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా క్లైమ్ చేసుకున్న 90 రోజుల తర్వాత 25 శాతం వేతనం పొందేలా ఈ స్కీమ్ ను రూపొందించడం జరిగింది.. అయితే కరోనా కారణంగా ఈ బెనిఫిట్స్ ను 50 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.