ప్రజలకు ఆ బ్యాంకు పండుగ ఆఫర్... లోన్ తీసుకుంటే?

VAMSI
" data-original-embed="" >

మారుతున్న కాలం అభివృద్ధి చెందుతున్న ప్రపంచం. వీటన్నింటి కారణంగా ఆర్ధికావసరాలు మరింత పెరిగిపోతున్నాయి. తద్వారా రుణాల కోసం బ్యాంకులను సంప్రదించే పరిస్థితులు వచ్చాయి. గతంలో అయితే ఎవరికైనా డబ్బు కావాలంటే పక్కన వారి దగ్గర తీసుకుని మళ్లీ వారికీ తిరిగి ఇచ్చేసేవారు. తద్వారా ఒత్తిడి లేకుండా మళ్ళీ వారికి అవసరమైనప్పుడు ఇచ్చేసేవారు. కానీ రాను రాను మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. బంధాలు పూర్తిగా కలుషితం అయిపోయాయి. డబ్బు అప్పు ఇవ్వడం కాదు కదా, కనీసం మాట సాయం కూడా చేయడం లేదు. దీనితో అవసరమున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకు లోన్ కోసం వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల కన్నా అధికంగా కుప్పలు తెప్పలుగా ప్రైవేట్ బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి.
వీరి టార్గెట్ ఒక్కటే ఎక్కువ వడ్డీలతో లోన్ లను ఇవ్వడం. పైగా బ్యాంకు లోన్ లు తీసుకుంటే ఒత్తిడి మాములుగా ఉండదు. ఇప్పుడు లోన్ తీసుకుంటున్న వారిలో అధికంగా ఇల్లు కట్టుకోవడానికి తీసుకునే వారు ఎక్కువగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రైవేట్ బ్యాంకు రుణాలు తీసుకునేవారికి వినాయక చవితి పండుగ సందర్భంగా కోటక్ మహీంద్రా బ్యాంకు ఒక శుభవార్తను అందించింది. అయితే ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందామా. గృహ రుణాలను తీసుకోవడానికి ఆసక్తి ఉన్న వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పాలి. మాములుగా ప్రైవేట్ బ్యాంకులలో లోన్ లకు బ్యాంకర్లు వేసే వడ్డీల గురించి తెలిసిందే. 11 నుండి 12 శతం వరకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది.
అయితే కోటక్ మహీంద్రా బ్యాంకు మాత్ర కేవలం 6.5 శాతం వడ్డీ నుండి మీరు తీసుకునే లోన్ అమౌంట్ ను బట్టి మారే అవకాశం ఉంది. ఈ సువర్ణావకాశం  కేవలం 60 రోజుల వరకు మాత్రమే ఉండనుందని తెలిపింది. ఈ ఆఫర్ ఈ రోజు అంటే సెప్టెంబర్ 10 నుండి నవంబర్ 08 వరకు ఉండనుంది అని కోటక్ బ్యాంకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మీరు ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకండి వెంటనే కోటక్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: