మనీ: ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు..

Divya
ఎవరు ఎంత సంపాదించినా ఆదా అనేది కచ్చితంగా వుండాలి. ఇక ఈ ఆదా చేయలేకపోతే సంపాదించింది అంతా వృధా అవుతూ ఉంటుంది కాబట్టి ..ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి డబ్బు ఇలా ఆదా చేసుకోండి . ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షాపింగ్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ షాపింగ్ పోర్టల్ ను ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఇలా  ఏదైనా ఆఫర్స్  ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి తప్పకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్ లు ఇచ్చే షాపింగ్ పోర్టల్ ను ఎంచుకోవడం ఉత్తమం.

షాపింగ్ చేసిన ప్రతిసారి బిల్లును దాచి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. షాపింగ్ చేయడానికి వెళ్లేముందు ఒకసారి పాత బిల్లులను కూడా తిరిగి చూసినప్పుడు.. మనం ఎక్కడ వృధాగా డబ్బు ఖర్చు చేశామో తెలిసిపోతుంది. తద్వారా డబ్బు ఆదా అయ్యే అవకాశం ఎక్కువ.

చేతికి డబ్బు వచ్చినప్పుడు తప్పకుండా దానిని విభజించడం నేర్చుకోవాలి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో ఆ నెల మొత్తానికి ముందే  విభజించుకోవడం వల్ల ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకోవచ్చు.

మనం తినే ఆహారం అయినా సరే, వండే వంట అయినా సరే దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు.. ఎంత తినగలరు ..అనే అంచనా ఉంటుంది కాబట్టి తక్కువ మొత్తంలో వండుకోవడమే ఆదా కి పునాది.
డబ్బు ఆదా చేయలేము అని అనుకున్న వాళ్ళు ముందుగానే ఒక  హుండీ లాంటిది తీసుకుని భద్రపరుచుకోవాలి.అందులో కొంత డబ్బు వేస్తూ వుండాలి. అత్యవసర పరిస్థితిలో తప్ప ఆ డబ్బులు తీయడానికి ప్రయత్నం చేయకూడదు.

ఆదా చేయాలని నెపంతో వేలకు వేలు ఆదా చేస్తూ ఇబ్బందులు పడటం సరికాదు. ఒక్క రూపాయి ఆదా అయినా కూడా ఆదా  అయినట్లే కదా.. కాబట్టి మొదట ఒక్క రూపాయి తో మీరు ఆదా చేయడం మొదలుపెడితే రాను రాను అలవాటు పడిపోతారు.. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: