మనీ: అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభం..
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమెరికా వంటి దేశాలలో వారం మొత్తం సంపాదించి, వారం చివర్లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ దేశం బాగా అభివృద్ధి చెందింది అని అర్థం. కానీ మన భారతదేశం అలా ఎప్పటికీ కానేకాదు. సంపాదించిన డబ్బును వృధా చేయకుండా, భావితరాలకు ఉపయోగపడే విధంగా చేయడమే మన దేశం యొక్క ముఖ్య ఉద్దేశం . ఇక ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు అనేక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్టాఫీసులు, బ్యాంక్ లు కలిసి ప్రజలు ఆర్థికంగా బాగుపడాలనే ఉద్దేశంతోనే రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.
ఇక అందులో భాగంగానే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన సరికొత్త స్కీం అటల్ పెన్షన్ యోజన పథకం. ఇందులో అట్టడుగు వర్గాల వారు , నిరుపేదలు ఈ స్కీమ్ లో డబ్బు జమ చేసుకోవచ్చు. ఇందులో రోజుకు ఏడు రూపాయలు చొప్పున ఆదా చేయడం వల్ల నిర్దిష్ట కాలం ముగిసే సరికి ,ప్రతినెల ఐదువేల రూపాయలను మీ ఖాతాలో జమ చేస్తారు. ఇక ఈ స్కీంలో ఇప్పటినుంచి డబ్బు జమ చేయడం వల్ల వృద్ధాప్యంలో ప్రతి నెలా కొంత మొత్తం డబ్బులను పొందవచ్చు. ఇక ఇందుకోసం మీకు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండడంవల్ల ఈ స్కీం లో చేరి డబ్బులు పొందవచ్చు.
ఇక 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ స్కీం లో చేరడానికి అర్హులు. ఇక ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రాతిపదికన నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఇక పాలసీదారు గనుక ఒకవేళ మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి ఆ తర్వాత నెల నుంచి పెన్షన్ డబ్బులు రావడం మొదలవుతుంది. ఒకవేళ వారు కూడా చనిపోతే, వారికి నామినీగా ఉన్న వ్యక్తికి రూ.1.70 లక్షల నుండి రూ. 8.50 లక్షల వరకు పొందే అవకాశం వుంటుంది.