మనీ: పోస్ట్ ఆఫీస్ నుంచి అదిరిపోయే స్కీం మీకోసం..
పోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం అరుదైన సరికొత్త పథకాలను, అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇక ఇందులో నిర్ణీత కాలంలో అనుకున్న డబ్బు కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండకపోగా, వడ్డీతో కలిపి ఎక్కువ రాబడి వస్తుంది. ఇక ఎవరైతే ఆర్థికంగా భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని అనుకుంటారో, అలాంటి వారు ఈ పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఆదాయంతో పాటు పెన్షన్ డబ్బులు తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇచ్చే స్కీం రకాలను ఎంచుకోవడం ఉత్తమం. మీకు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ ఆఫీస్ అందించే సరికొత్త రకాల ఆఫర్ లను, మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా ఒక సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ పథకం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైతే ప్రతి నెలా కొంత మొత్తం డబ్బులు చెల్లించాలి అని అనుకుంటున్నారో, అలాంటివారు రికరింగ్ డిపాజిట్ స్కీం లో చేరడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఈ స్కీమ్ లో చేరడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండకపోవడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఇక పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న రికరింగ్ డిపాజిట్ స్కీం లో 5.8 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. ఇక ఈ స్కీంలో ప్రతి నెల రెండు వేల రూపాయలను, ఐదు సంవత్సరాలపాటు జమ చేయడం వల్ల నిర్ణీత కాలం ముగిసేసరికి మన చేతికి రూ.1,40,000 వస్తుంది.
ఈ పథకంలో ప్రతి నెల రెండు వేల రూపాయలను జమ చేయడం వల్ల, ఐదు సంవత్సరాలకు లక్ష ఇరవై వేలు అవుతుంది. 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. కాబట్టి అదనంగా 20 వేల రూపాయలు మన చేతికి వస్తాయి. మీరు రెండు వేల రూపాయల కంటే ఎక్కువ జమ చేస్తే, మీకు అంతే రెట్టింపు స్థాయిలో డబ్బులు వస్తాయి.