మనీ : వ్యాపారం చిన్నదే.. కానీ లాభం..?

Divya

ఇటీవల కాలంలో అన్ని చాలా కష్టతరంగా మారిపోయాయి. అందుకు కారణం కరోనా వైరస్ మహమ్మారి అని చెప్పవచ్చు. ఈ మహమ్మారి కారణంగా ఎవరూ, ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండు అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఇక్కడ ఇద్దరూ సోదరులు చిన్న వ్యాపారం మొదలుపెట్టి, ప్రస్తుతం మంచి లాభార్జన పొందుతున్నారు. అయితే ఈ సోదరులు సాధించిన విజయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


సాధారణంగా మన దేశంలో ఎన్నో షాప్స్,  సూపర్ మార్కెట్స్, మాల్స్ ఇలా ఎన్ని ఉన్నప్పటికీ, ఇంటి దగ్గరకు వచ్చే బండి మీదే కొనడానికి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే దుకానాలకు వెళ్లి వచ్చే శ్రమ తగ్గుతుంది. అందులోనూ బండి మీద అయితే  తాజాగా దొరుకుతాయి కాబట్టి, ముఖ్యంగా కూరగాయలు, తాజా పండ్ల విషయంలో అయితే ఇదే జరుగుతుంది. ఇక ఇటీవల కాలంలో కొబ్బరిబొండాలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని మీరట్ లో ఒక యూనివర్సిటీ రోడ్డు పక్కన ఇద్దరు సోదరులు కొబ్బరి బొండాల బండిని నిర్వహిస్తూ ఉండేవారు.

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంతో,ఎవరు కొనడానికి వచ్చేవారు కాదు. ఇక మళ్లీ ఆర్థిక సంక్షోభం ఎదురవకుండా, వీరు డైరెక్ట్ గా హోమ్ డెలివరీ చేస్తామంటూ షాప్ ముందు బోర్డు కూడా పెట్టేశారు. ఇక అంతేకాదు ఎవరైతే పది టెంకాయల కంటే ఎక్కువ తీసుకుంటారో వారికి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేస్తామంటూ,ఆ బోర్డ్ పై ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక నాణ్యతలో ఎక్కడా లోటు లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా కొబ్బరిబొండాలు తీసుకోవడం ప్రారంభించారు. ఇక అంతే కాదు వీరు కొబ్బరి బొండం లోని నీటిని బాటిళ్లలో నింపి మరీ, హోమ్ డెలివరీ చేసే వారు. అలా శుద్ధత కలిగిన కొబ్బరినీళ్లు హోమ్ డెలివరీ అవుతుంటే, వేలల్లో వీరి దగ్గరకు ఆర్డర్ లు వచ్చేవట.


అలా చిన్న వ్యాపారం తోనే రోజుకు వేలకు వేలు సంపాదిస్తున్నారు ఈ ఇద్దరు సోదరులు. ఇక అంతే కాదు త్వరలోనే తాజా కూరగాయలు, పండ్లను కూడా హోమ్ డెలివరీ చేస్తామంటూ ఈ సోదరులిద్దరూ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: