మనీ : రూ.500 తో అకౌంట్ తెరిస్తే చాలు.. లక్షాధికారి అవ్వొచ్చు..
డబ్బు సంపాదించాలని, అందరిలో గౌరవమర్యాదలు పొందాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు . అంతేకాకుండా ఈ డబ్బు సంపాదించాలంటే క్రమశిక్షణ , ఓర్పు చాలా ముఖ్యమైనవి. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు. ఆ డబ్బును ఆదా చేసుకోవడం కూడా తెలియాలి. అప్పుడే నలుగురిలో సంతోషంగా, గౌరవ మర్యాదలతో గడపడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి అని అనుకునే వారికి ఒక స్కీం అందుబాటులో ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF )అకౌంట్ తెరిస్తే బోలెడన్ని ప్రయోజనాలు పొందవచ్చు. భవిష్యత్తులో ధైర్యంగా ఉండాలంటే ఈ అకౌంట్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక పూర్తి వివరాలకు సంబంధించి మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి రూ.500 తో పీ పీ ఎఫ్ ఖాతాను తెరవండి. ఇలా ఈ అకౌంట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని తెలుసుకోవచ్చు.
ఈ అకౌంట్ ను మీరు మీ పిల్లల పేరు మీద కూడా ఓపెన్ చేయవచ్చు. అయితే పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు గార్డెన్ అకౌంట్ నిర్వహణ చూసుకుంటారు. అయితే దీని వల్ల ఎంత డబ్బులు వస్తాయి, ఎలా డబ్బులు పెట్టాలి వంటివి కూడా తెలుసుకుందాం..
పీపీఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్ళు. అదనంగా PPF మెచ్యూరిటీ కాలాన్ని కావాలంటే మరో ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా మీ అకౌంట్ కొనసాగుతూనే ఉంటుంది. అదే మీరు ప్రతి సంవత్సరం PPF ఖాతాలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ కాలం తర్వాత మీకు రూ.40 లక్షలకు పైగా వస్తాయి. ఇలా మీరు ఈ బెనిఫిట్ ని పొందవచ్చు. ఈ ఖాతా పై 7.1 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తుంది.