మనీ : కరోనా నుండి బయటపడ్డ నగదు బహుమతి..

Divya

కరోనా రోజురోజుకు విజృంభించి, సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరిని ఎటాక్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలామంది ఈ మహమ్మారి బారిన పడి, చనిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా చాలా మంది లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా  చికిత్సలు పొందుతున్నారు.. ఇలాంటి సమయంలో కరోనా నుంచి బయటపడితే నగదు బహుమతి ఇస్తామని ప్రకటన చేస్తున్నారు..? అయితే ఇది ఎంతవరకు నిజం అని ప్రజలు  వాపోతున్నారు.? అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

విజయవాడ జిల్లాలోని కొవిడ్ కేర్ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు..కొవిడ్ లక్షణాలను బట్టి వైద్య నివేదికల ఆధారంగా చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఏడు కొవిడ్ కేర్ కేంద్రాల ద్వారా వ్యక్తులకు చికిత్స అందించనున్నట్లు వివరించారు.. అంతే కాకుండా ఏ వ్యక్తి కూడా ఆక్సిజన్ అందక చనిపోకూడదని, అందరికీ ఆక్సిజన్ అందేలా,ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.. ఇక అంతే కాకుండా మెరుగైన వైద్య సేవలను అందించడం తో, కరోనా బాధితులు ఆసుపత్రిలోనే చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు..


ఇక కొవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స పొంది, కోలుకొని డిశ్చార్జ్ అయిన వారిని గుర్తించి, నగదు పురస్కారాన్ని కూడా అందజేస్తామన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు కోవిడ్ అప్డేట్ ల గురించి తెలుసుకొని, కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులను  షార్ట్ లిస్ట్ చేసి, అందులో లక్కీ డిప్ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రతి సోమవారం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.. ఇక విజేతలకు రూ.15,000, రూ.10,000, రూ.ఐదు వేల చొప్పున నగదు పురస్కారాలు కూడా అందిస్తామని వెల్లడించారు. జిల్లాలోని ముఖ్యంగా మచిలీపట్నం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో 7 కొవిడ్ కేర్ కేంద్రాలు ఉండగా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్  తెలిపాడు. ఈ నగదు బహుమతి ఎందుకు ప్రకటించారంటే, పాజిటివ్ వచ్చిన వ్యక్తులు మనోధైర్యాన్ని కోల్పోయి భయపడుతూ ఉండడంతో, వారి ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోతున్నారు.. అయితే ఈ నగదు బహుమతి పేరిట వారిలో మనోధైర్యాన్ని నింపి, వారు కోలుకునేలా చేయడమే మా లక్ష్యం అంటూ కలెక్టర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: