మనీ : పోస్ట్ ఆఫీస్ నుంచి అదిరిపోయే ఆఫర్.. ఇలా చేస్తే కోటి రూపాయలు మీ సొంతం..

Divya

పోస్ట్ ఆఫీస్ లు అందరికీ అనుకూలంగా ఉండేలా, ప్రతిసారి కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ తో పాటు ఇతర స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్ట్ ఆఫీస్ లు కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు పోస్టల్ శాఖలో ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కానీ ఇందులో చాలామంది కస్టమర్లకు పోస్ట్ ఆఫీస్ లో ఉండే కొన్ని రకాల స్కీమ్ ల గురించి తెలియవు. అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి ఉంది. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి. ఇందులో పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు..
ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులకు వెళ్లి పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు రావు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇక ఈ పీపీఎఫ్ స్కీమ్ పై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి సమీక్షిస్తూ ఉంటుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది లేదా తగ్గించే అవకాశం కూడా ఉండొచ్చు. లేదా స్థిరంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు..
ఈ పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అయితే అవసరం అనుకుంటే ఈ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్ళవచ్చు. ఈ పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు రోజుకు 300 రూపాయలు ఆదా చేస్తే , నెల చివర్లో రూ. 9000 అవుతుంది. అప్పుడు ఈ మొత్తాన్ని ఈ పీపీఎఫ్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మీరు 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే, కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువ. చూశారు కదా! మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులకు వెళ్లి ఈ పీపీఎఫ్ అకౌంట్ గురించి తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: