మనీ: వారి ఖాతాలోకి రూ.10 వేలు జమ: ఏపీ ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం కష్టాల్లో కూడా ప్రజలకు అండగా నిలుస్తూ ,వారి అవసరాలను తెలుసుకుంటూ, అందుకు అనుగుణంగా వారికి కావలసిన సహాయాన్ని అందిస్తూ వస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యార్థులకు తగిన సహాయమును అందజేసింది. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు కూడా వారి డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇప్పుడు మరొకసారి ఒక మంచి ముందడుగు వేసింది. అర్హులైన వారికి వారి అకౌంట్ లో పదివేలు జమ చేస్తామని మరొకసారి హామీ ఇచ్చింది. దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి వివరాల్లోకి వెళితే, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల స్కీమ్ లో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కూడా ఒకటి . ఇక ఈ స్కీమ్ కింద వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 10,000 జమ చేయనుంది. అయితే ఇందుకోసం ఎవరెవరు అర్హులో వారి ఖాతాలోకి 10,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ కరోన సమయంలో మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా జగన్ ప్రభుత్వం పదివేల రూపాయలను వారికి ఉచితంగా ఇవ్వబోతోంది .
ముఖ్యంగా సముద్రాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో చేపలు, రొయ్యల సంరక్షణకు ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేటను నిషేధిస్తారు. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లి చేపలను పట్టకూడదు అన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ఇక వీటిపైనే బ్రతుకు బండిని సాగిస్తున్న ఎంతో మంది ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారు. ఇలాంటి సమయంలోనే వీరిని ఆదుకోవడానికి జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది . అర్హులైన వారికి పదివేల రూపాయలను ఉచితంగా అందివ్వడానికి సిద్ధమవుతోంది.
అందుకే అర్హులైన వారికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కింద మే 18న రూ.10 వేలు వస్తాయి. ఈ స్కీమ్ కింద దాదాపు 1.32 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.ఈ డబ్బులు వస్తే వాళ్ళకి ఊరట కలుగుతుంది. ఒక పక్క ఉపాధి లేకపోవడం మరో పక్క కరోనా.. ఈ సమయం లో వీరికి రూ.10 వేలు వస్తే ,కొంచెం రిలీఫ్ వస్తుంది.