మనీ : కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా డీలా పడిపోయిందా..?
కరోనా వచ్చిన తరువాత ప్రపంచ దేశాల ప్రజలందరూ ,వారి ఆర్థిక జీవితం కూడా అతలాకుతలమౌతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా డీలా పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ప్రమాదంలో పడింది . రోజురోజుకీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. పోయిన సంవత్సరం లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నష్టం నుంచి కోలుకుంటున్న భారత ఎకనామిక్ ,ఇప్పుడు స్థానికంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయింది . ఈ క్రమంలోనే వైరస్ నియంత్రణ సాధ్యం కాకపోతే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఈ పరిణామం కీలక రంగాలలో కూడా ప్రభావితం చేస్తోంది . ఇప్పటికే పర్యాటక, విమానయాన, నిర్మాణ ,ఆతిథ్య, రెస్టారెంట్ ,వినోద , వాహన రంగాలకు కరోనా సెగ తగులుతోంది .ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో అయిన ఏప్రిల్ ,జూన్ లో వృద్ధి రేటు తగ్గే వీలుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు . ఒకవేళ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కరోన తీవ్రత అధికంగా ఉన్నట్లయితే, దేశ ఆర్థిక వ్యవస్థకు మళ్లీ కష్టాలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక నిన్నమొన్నటిదాకా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది అని , అంచనాలు వేసిన రేటింగ్ ఏజెన్సీలు , కూడా నేడు దేశంలో కరోనాను చూసి వారి లెక్కలను సవరించుకున్నారు . ఈ ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాలు సుమారు 13.5 శాతం నుంచి 12.6 శాతానికి దిగివచ్చింది. ఇక జేపీ మోర్గాన్ సైతం 13 శాతం నుంచి 11 శాతానికి పరిమితం అయింది.. వృద్ధిరేటు నిజానికి ఈ స్థాయి తక్కువేం కాదు .అయితే అంచనాలు తిరుగుముఖం పడితే ,అవి మళ్ళీ మైనస్ లోకి జారుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు..
ఒకవేళ జూన్ కల్లా కరోన సెకండ్ వేవ్ తగ్గినట్లయితే ,తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది .లేకపోతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ,అందుకే ప్రాణాలను ,జీవనోపాధిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు..