డబ్బే డబ్బు : కరోనా పరిస్థితులలో చిప్ ల తయారీకి ప్రోత్సాహం !

Seetha Sailaja
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశంలో మళ్ళీ కరోనా ఉధృతి ప్రారంభం కావడంతో ఈ సెకండ్ వేవ్ ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. కరోనా సెకండ్ వేవ్ పై అంచనాలు తప్పడంతో ఏమి చేయలేని పరిస్థితులలో ప్రభుత్వాలు మారిపోయాయి. వచ్చే రెండు నెలలలో ఈ పరిస్థితులు మరింత పెరిగిపోయి కరోనా కేసుల పెరుగుదల మరింత పెరిగిపోయి దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో దేశంలో చాల వ్యాపారాలు నెగిటివ్ ట్రెండ్ లో కొనసాగుతూ ఉన్నా దేశంలో మొబైల్ ఫోన్స్ లాప్ టాప్ లు ఎలట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయిది. ఇలాంటి పరిస్థితులలో వీటి కొరత విపరీతంగా పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా లక్ష కార్లు డెలివరీ ఆర్డర్ ఉన్నప్పటికీ వాటి డెలివరీ ఆలస్యం అవుతోంది.

దీనికికారణం చిప్స్ కొరత ఏర్పడటంతో కార్లు కంప్యూటర్లు ఎలట్రానిక్ వస్తువుల తయారీ రంగం అనేక సమస్యలు ఎదుర్కుంటోంది. దీనితో చిప్స్ తయారీకి ఒక కంపెనీ 7,500 ల కోట్ల పెట్టుబడితో స్థాపించడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ కంపెనీలకు ప్రోత్సాహాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. చిప్స్ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి సంస్థ అయిన శాంసంగ్ భారత్ లో ఒక చిప్స్ తయారీ ప్లాంట్ ను స్థాపించాలని ముందుకు వస్తున్నప్పటికీ ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల కార్లకు సెల్ ఫోన్స్ కు లాప్ టాప్ లకు ఎలట్రానిక్ ఆటోమొబైల్ కంపెనీలకు ఏర్పడిన డిమాండ్ ఎంతకాలం భారత్ లో కొనసాగుతుందో అర్థంకాక శాంసంగ్ కంపెనీ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంటి నుంచి పనిచేసే కల్చర్ బాగా పెరిగిపోవడంతో లాప్ టాప్ లకు ప్రస్తుతం డిమాండ్ కొనసాగుతోంది. ఈ డిమాండ్ కు అనుగుణంగా దేశీయ రంగంలోనే చిప్స్ తయారీ పై శ్రద్ధ పెట్టి వీటి అభివృద్ధికి సంబంధించిన కంపెనీలకు 100 కోట్ల డాలర్ల సహాయం చేయమని బ్యాంకింగ్ వర్గాల పై ఒత్తిడి పెరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: