మనీ : సులభంగా డబ్బు సంపాదించడం ఎలానో తెలుసా..!

Divya

ప్రస్తుత కాలంలో  ప్రతి ఒక్కరు డబ్బు పైన చాలా రకాలుగా ఆధారపడుతూ ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమవుతుంది. అయితే ఆ డబ్బు ఎలా సంపాదించాలి..అని సతమతమౌతూ ఉంటారు. మరీ ముఖ్యంగా డబ్బు అనేది నిత్య అవసరంగా మారింది. మనం తాగే నీళ్ళ నుంచి తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి డబ్బు పెట్టి కొనవలసిన పరిస్థితి ఏర్పడింది.


పూర్వకాలంలో డబ్బుకు  విలువ  చాలా  తక్కువగా ఉండేది. ఎందుకంటే పూర్వకాలంలో స్వతహాగా వ్యవసాయం చేసుకుని, వారు తినడానికి కావలసిన ఆహార పదార్థాలను వారే స్వయంగా పండించుకొని, మరీ తయారు చేసుకునేవారు.  కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి చాలా మంది ఆసక్తిగా లేరు. తద్వారా ప్రతి ఒక్కరికీ డబ్బు పెట్టి కొనవల్సిన పరిస్థితి ఏర్పడింది . అయితే ఈ డబ్బులు ఎలా సంపాదించాలి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ డబ్బును సంపాదించాలి అంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి.


చిన్నచిన్న పెట్టుబడులతో ఇంట్లో ఉంటూనే పేపర్ ప్లేట్ తయారీ, ప్లాస్టిక్ టీ కప్ తయారీ,  బేకరీ ఫుడ్ తయారీ,  కర్రీ పాయింట్, మొబైల్ క్యాంటీన్ అంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. వీటన్నింటిని కూడా ఇంటి వద్దనే ఉంటూ సంపాదించుకోవచ్చు. ఇటీవల కాలంలో  మహిళలకు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా చిన్న చిన్న ఉద్యోగాలను పెట్టుబడి లేకుండా కూడా,  ఎలా చేసుకోవాలి చూపిస్తున్నారు కొంతమంది నిపుణులు. వాటిని ఫాలో అవుతూ కూడా డబ్బులు సంపాదించవచ్చు.


అయితే ముఖ్యంగా ఈ సంపాదించిన డబ్బులను ఆదా చేసుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆదా చేయడం మొదలు పెడతామో, అప్పుడు డబ్బు మన దగ్గర సమకూరుతుంది. ఒకవేళ ఆదా చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు,  ఎంత సంపాదించినా కూడా అది వృధానే అవుతుంది తప్పా, భావితరాలకు ఉపయోగపడదు అని గమనించాలి. కాబట్టి మీరు సంపాదించిన డబ్బులు లో కనీసం 20 శాతం డబ్బులు దాచి పెట్టగలిగితే పోను పోను డబ్బు సంపాదించి దాచిపెట్టడం సులువవుతుంది.. తద్వారా డబ్బు లేని పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: