మనీ : ఇంట్లో ఉండే సులభంగా డబ్బు సంపాదించే చిన్న చిన్న వ్యాపారాలు ఏంటో తెలిసింది..?

Divya

డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా, వారికి నచ్చిన పనులు చేస్తూ,డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే కరోనా వచ్చిన తర్వాత చాలామంది బయటకు వెళ్లి పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంట్లో ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ డబ్బును సంపాదించవచ్చు. ఆ వ్యాపారాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


బ్యూటీ పార్లర్ :
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అందుకోసం ఒక బ్యూటీషియన్ గా సర్టిఫై ఉండాలి.. అయితే దీనిపై మీకు అవగాహన ఉండాలి.  తద్వారా బ్యూటీ పార్లర్ ఒక మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది..


క్యాండిల్ మేకింగ్:
ఇంట్లో ఉండే మహిళలకు ఇది ఉత్తమమైన వ్యాపారం. అయితే ఇంటర్నెట్ లో చూస్తే ఈ క్యాండిల్స్ ను వివిధ రకాల్లో ఎలా చేయాలో తెలుస్తుంది. అయితే ఈ క్యాండిల్ తయారు చేయడానికి మీకు కావలసిన రా మెటీరియల్ అంతా సులభంగా దొరుకుతుంది. తక్కువ పెట్టుబడి తో స్టార్ట్ చేసి, ఎక్కువ లాభాన్ని పొందవచ్చు..


క్యాటరింగ్:
మీకు వంట చేయడం వచ్చా.. అందులో మీరు స్పెషలిష్టా.. మరి ఇంకెందుకు ఆలస్యం..క్యాటరింగ్ వ్యాపారాన్ని మొదలు పెట్టండి. ముందుగా మీకు తెలిసిన వారి నుండి ఆర్డర్ తీసుకొని నెమ్మదిగా కార్పొరేట్ ఈవెంట్స్, బర్తడే ఫంక్షన్, మ్యారేజెస్  వంటి చిన్నచిన్న ఫంక్షన్లకు ఫుడ్ డెలివరీ చేస్తూ ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించవచ్చు..


ట్యూటరింగ్ :
చదువు అనేది అన్ని స్టేజ్ ల వారికి అవసరం అవుతుంది. కాబట్టి మీకు చదువు చెప్పడం ఇష్టం ఉంటే మీరు చిన్న పిల్లలు మొదలుకొని,  కాలేజీ పిల్లలు వరకు ఇంట్లో ఉంటూనే ట్యూషన్ చెప్పవచ్చు.  తద్వారా డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గం ఏర్పడుతుంది.


టైలరింగ్:
మీకు టైలరింగ్ లో మంచి అవగాహన ఉంటే, మీకు మంచి క్రియేటివిటీ ఉండి, బ్లౌజులు కుట్టడానికి  మీరు సిద్ధంగా ఉంటే టైలరింగ్ పద్ధతి చాలా మంచిది. ఇటీవల కాలంలో చీర కొన్న ధర కంటే బ్లౌజ్ కుట్టించడానికి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది.  కాబట్టి టైలరింగ్ ఎంచుకోవడం వల్ల మంచి ఆదాయాన్ని రాబట్టవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: