డబ్బే డబ్బు : ఉద్యోగాల నియామకాల తీరును మార్చేసిన కొవిడ్ !

Seetha Sailaja
మరో నాలుగు రోజులలో ముగిసిపోతున్న 2020 కొవిడ్ నామ సంవత్సరంగా మారిపోయింది. లాక్ డౌన్ లు కర్ఫ్యూలు ఉద్యోగాల తొలగింపులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. వేలాదిమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డారు. అనేకమంది ఉద్యోగుల జీతాలు సగానికి సగం తగ్గిపోయాయి కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పని చేయించుకుంటున్నారు.


ఈ విధానం వచ్చే సంవత్సరం కూడ పూర్తిగా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. అయితే వచ్చే నూతన సంవత్సరం 2021లో అనేక కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నియామకాలలో మహిళల పాత్ర మరింత పెరగనున్నదని వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో పురుషుల కంటె మహిళలు చాల వేగంగా సమర్థవంతంగా పని చేస్తున్నారని అనేక కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


మహిళలు తమ ఇంటి పనులు పూర్తి చేసుకుని ప్రతిరోజు దూరంలో ఉన్న ఆఫీసులకు వెళ్ళవలసిన అవసరం లేకపోవడంతో తమ సమయం చాల ఆదా అవుతోంది అన్న ఉత్సాహంతో మహిళలు ఉత్సాహంగా తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారని అనేక కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధా డేటా రంగాలకు సంబంధించిన విభాగాలకు మహిళల హవా కొనసాగుతోందని ఈమధ్య నిర్వహించిన ఒక సర్వే తెలియచేస్తోంది.


దీనితో రానున్న సంవత్సరంలో మహిళలకు అనేక ఉద్యోగ అవకాశాలతో పాటు వారి జీతాలు కూడ బాగా పెరిగే అవకాశం ఉందని ‘శాలరీ ట్రెండ్స్ సర్వే ఇన్ ఇండియా’ అభిప్రాయపడుతోంది. ఇది ఇలా ఉండగా కేవలం ఐటీ కంపెనీలలోనే మాత్రం కాకుండా తయారీ రంగంలో కూడ వృద్ధి కనిపిస్తున్న పరిస్థితులలో కరోనా కల్లోలం కొనసాగుతున్నా ఆహార ఉత్పత్తుల రంగం సిమెంట్ ఆటోమొబైల్ ఫార్మా కంపెనీలు బాగా పుంజుకొవడంతో ఈ రంగాలలో వచ్చే సంవత్సరం భారీగా ఉద్యోగ అవకాశాలు ఉండే ఆస్కారం ఉంది అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: