డబ్బే డబ్బు : షాకింగ్ 2050 నాటికి సెన్సెక్స్ 6లక్షల పాయింట్లు !
మొన్న సెన్సెక్స్ ఆల్ టైమ రికార్డు స్థాయిని చేరుకొని 46 వేల పాయింట్లకు చేరువ కావడంతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకుని ఒక్కరోజు కగడవకుండానే వారి ఆనందానికి బ్రేక్ పడింది. నిన్న సెన్సెక్స్ మళ్ళీ తన జోష్ ను తగ్గించుకుని రివర్స్ గేర్ లోకి వచ్చింది.
ఈ స్వల్ప అడ్డంకులు ఏర్పడినప్పటికీ గత 8 నెలలలో స్టాక్ మార్కెట్ లో ఈక్విటీ మదుపర్ల సంపద 81 లక్షల కోట్లకు చేరుకోవడంతో స్టాక్ మార్కెట్ చిన్నచిన్న కరెక్షన్స్ కు గత 8 నెలలలో లోనైనప్పటికీ షేర్ మార్కెట్ గత కొన్ని నెలలుగా అనూహ్యంగా పుంజుకున్న వాతావరణం చూసి లేటెస్ట్ గా షేర్ మార్కెట్ పై వెలుగులోకి వచ్చిన ఒక అంచనా ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
2050 నాటికి ప్రపంచదేశాల స్తూల దేశీయ ఉత్పత్తి 180 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అదేవిధంగా 2050 నాటికి భారత జనభా 160 కోట్లకు చేరుకొని ప్రపంచంలోని ప్రతి ముగ్గురు వినియోదారులలో ఒక వ్యక్తి భరత్ లో ఉండే పరిస్థితులలో 28 ట్రిలియన్ డాలర్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో 13 శాతం మన ఇండియాడే ఉంటుంది కాబట్టి 2050 నాటికి మన స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 13 రెట్లు పెరిగి 6 లక్షల పాయింట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
అయితే ఇది అంతా ఒక అంచనా మాత్రమే అంతేకాదు అమెరికా వ్యూహ కర్త ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన డాక్టర్ రాబర్ట్ కుహ్న్ అభిప్రాయం ప్రకారం 20 సంవత్సరాలు తరువాత ప్రపంచాన్ని శాసించే ఆర్ధిక శక్తిగా చైనా ఎదుకుతుందని ఆ సమయానికి అమెరికన్ డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందని చేసిన అంచనా కూడ సంచలనంగా మారింది. అంతేకాదు రాబోయే 20 సంవత్సరాలలో హోమ్ హెల్త్ కేర్ సేవలు అనూహ్యంగా పెరుగుతాయని వైద్యంరంగంలో వచ్చే అనూహ్యమైన మార్పులతో ప్రపంచం రూపు రేఖలు మారిపోతాయని మరో అంచనా..