డబ్బే డబ్బు : సంపదకు శతృవు అసహనం !

Seetha Sailaja
అసహనంతో ఒక వ్యక్తి ఎలాంటి లక్ష్యాలను చేరుకోలేడు. లక్ష్యాలను చేరుకోకుండా ఒక వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ధనవంతుడు కాలేడు. దీనితో మనకు అసహనం ఏస్థాయిలో ఉంది అన్న విషయాన్ని మనకు మనమే తెలుసుకోవడానికి ఈప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి భావాలు మనకు నచ్చక పోవడంతో ఆవ్యక్తిని తక్కువ చేస్తూ మాట్లాడే వ్యక్తి ఎప్పుడు ధనవంతుడు కాలేడు.


మన జీవిన శైలికి మన ఆలోచనలకు ఎదుటి వ్యక్తులు భిన్నంగా ఉన్నారు అంటూ తరుచూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ జీవనాన్ని కొనసాగించే వ్యక్తులు కూడ ధనవంతులు కాలేరు. అదేవిధంగా ప్రతివ్యక్తి మన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఉండాలి అని భావించే వ్యక్తులు కూడ ఐశ్వర్య వంతులు కాలేరు. మరికొందరు తమకు నచ్చని ఎదుటి వ్యక్తి తెలివితేటల పై అదేవిధంగా వారి వ్యక్తిత్వం పై తరుచూ జోకులు వేస్తూ ఉంటారు.


ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు తాము ఎంత తెలివైనవారు అయినప్పటికీ ధనాన్ని సంపాధించలేరు. ప్రతి విషయంలోనూ తప్పు ఒప్పు ఉంటాయి. అయితే ఎప్పుడు తప్పును మాత్రమే హైలెట్ చేస్తూ ఒప్పును పట్టించుకోని వ్యక్తులు కూడ ధన సంపాదన విషయంలో వెనకపడి ఉంటారు. అదేవిధంగా ఒక రంగంలో తాము తిరిగులేని నిపుణులమని భావిస్తూ ఎదుటి వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించలేని వ్యక్తులు కూడ ఎప్పుడు విజయాన్ని అందుకోలేరు. అదేవిధంగా మనకంటే దిగువ స్థాయి వ్యక్తులు చెప్పే విషయాలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రవర్తించే వారు కూడ విజయానికి చాల దూరంగా ఉంటారు.


మనం నేర్చుకున్న దానికన్నా తెలియనిది ఎంతో ఉంది అన్న వాస్తవం గ్రహించినవారు మాత్రమే ధనవంతులు కాగాలుగుతారని వ్యక్తిత్వ వికాశ నిపుణుడు నెపోలియన్ హిల్ అనేక సందర్భాలలో తన రచనలలో పేర్కొన్నాడు. అయితే ఈ లక్షణాలు ఉన్న చాలామంది తాము అసహనశీలురమని అంగీకరించడానికి ఇష్టపడరు. అంతేకాదు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న చాలామంది తమ ఆలోచనలు అలవాట్లు చాల గొప్పవని భావిస్తూ ఉంటారు. ఇలా భావిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తారు కాని వాస్తవాలు తెలుసుకుని ధనవంతులు కావడానికి ప్రయత్నించరు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: