డబ్బే డబ్బు ! 40 సంవత్సరాలకే అద్భుతాలు సృష్టించిన ఈశా ఆకాష్ అంబానీ !

Seetha Sailaja

ప్రపంచ వ్యాప్తంగా 40 ఏళ్ల వయసుకే వ్యాపార రంగంలో అద్భుతాలు సాధించి ఘనత పొందిన వారి జాబితాను ‘ఫార్చూన్’ పత్రిక ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఏకంగా ఈ లిస్టులో ముగ్గురు యువ పారిశ్రామిక వేత్తలకు స్థానం లభించడం పారిశ్రామిక వర్గాలలో సంచలనంగా మారింది.


ముఖ్యంగా ఈ లిస్టులో ముకేష్ అంబాని కవల పిల్లలు అయిన ఈశా ఆకాష్ అంబాని లు స్థానం పొందారు. కేవలం 28 సంవత్సరాల వయసుకే ఫార్చూన్ పత్రిక లిస్టులో స్థానం పొందారు. వీరితో పాటు బైజూస్ యప్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కూడ ఈ లిస్టులో స్థానం పొందాడు. కరోనా పరిస్థితులు వల్ల వీరంతా తమ ఇళ్లకే పరిమితం అయిపోయినా రోజుకు 16 గంటలపాటు తమ సంస్థల వ్యార కార్యకలాపాలను నిర్వహిస్తూ ఈ వ్యతిరేక పరిస్థితులలో కూడ తమతమ వ్యాపారాలను అభివృద్ధి పనులలో పయనింప చేస్తున్నారు.

ముఖ్యంగా బైజూ రవీంద్రన్ అతి చిన్న వయసులో దేశంలోనే అతిపెద్ద విద్యా సాంకేతిక కంపెనీని స్థాపించి ఆన్ లైన్ విద్యా కంపెనీని కరోనా వల్ల ఏర్పడ్డ మార్కెట్ వ్యతిరేక పరిస్థితులలో కూడ ఎలా వేగంగా అభివృద్ధి చేయవచ్చో అందరికీ అర్ధం అయ్యేలా  తన సత్తాను చాటాడు. ఈ కంపెనీ లక్షల సంఖ్యలో విద్యార్ధులను సన్నద్ధం చేస్తూ ప్రస్తుతం తన కంపెనీ విలువను 10 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్ళాడు.


ఇక ఇప్పుడు ఈ లిస్టులో స్థానం తగ్గించుకున్న అదర్ పూనావాలా నిర్వహిస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కంపెనీగా అవతరించబోతోంది ప్రస్తుతం 150 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఈ సంవత్సరాంతానికి తీసుకురావాలని ప్రయత్నిస్తూ కేవలం 3 డాలర్ల ధరకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వగలను అని నమ్మకంగా చెపుతున్న ఇతడి మాటలు నిజం అయితే భారత్ లో మరో కుబేరుడుగా మారిపోవడం ఖాయం. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ వ్యతిరేక పరిస్థితులలో కూడ వీరంతా సాధిస్తున్న అద్భుతాలు పరిశీలిస్తే పట్టుదల ఉండే 40 ఏళ్ల లోపే అద్బుతాలు చేయవచ్చు అని అనిపిస్తుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: