డబ్బే డబ్బు : బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న బిజినెస్ కరస్పాండెంట్లు !

Seetha Sailaja

లాక్ డౌన్ ప్రభావంతో అనేక రంగాలలో పెనుమార్పులు వస్తున్నాయి. అన్ని రంగాలతో పాటుగా బ్యాంకింగ్ రంగంలో కూడ అనేక విప్లవాత్మక మార్పులకు ఈ కరోనా శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నగదు ప్రయోజనాలను నేరుగా లబ్దిదారులకు అందించడంలో బిజినెస్ కరస్పాండెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.


ఈ లాక్ డౌన్ సమయంలో గత మే నెలలో రికార్డు స్థాయిలో ఈ బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా రికార్డు స్థాయిలో లావాదీవీలు జరిగాయని ఆర్ధిక రంగ నిపుణులు చెపుతున్నారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సర్వీస్ లు అందించడంలో ఏటిమ్ లకు బదులుగా బిజినెస్ కరస్పాండెంట్లు ప్రత్యామ్నాయంగా మారారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బ్యాంకులు దగ్గరకు రాకుండా వారి ఇంటి వద్దననే వారి ఖాతాలకు సంబంధించిన చిన్నచిన్న మొత్తాలు అందించడం అదేవిధంగా చిన్నచిన్న మొత్తాలకు సంబంధించిన రుణాలను ఇంటి వద్దనే అందించే పనులు ప్రస్తుతం అనేక బ్యాంకులు తరఫున ఈ బిజినెస్ కరస్పాండెంట్లు చేస్తున్నారు.


ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులలో ఈ బిజినెస్ కరస్పాండెంట్లు మైక్రో ఏటిఎమ్ లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అనేక బ్యాంకులకు సంబంధించి చిన్నచిన్న మొత్తాలలో గ్రామీణ ప్రాంతాలలో నగదు బట్వాడా చేస్తున్న ఈ బిజినెస్ కరస్పాండెంట్లు ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థలో కీలకంగా మారారు. ప్రస్తుతం వివిధ బ్యాంక్ లకు సంబంధించి 4 లక్షల వరకు సంఖ్యలో ఉన్న వీరి సంఖ్య రానున్న రోజులలో 15 లక్షలకు పెరుగుతుందని అంచనాలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం వీరు దేశ వ్యాప్తంగా 5 వేల కోట్ల రుణాలు 10 వేల నుండి 50 వేల లోపు వీరిద్వారా ప్రాసెస్ అవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగ నియామకాలు బాగా తగ్గిన పరిస్థితులలో ప్రస్తుతం ఈ బిజినెస్ కరస్పాండెంట్లు పరోక్షంగా బ్యాంక్ కార్యకలాపాలకు గ్రామీణ ప్రాంతాలలో సహకరిస్తున్న పరిస్థితులలో వీరందరికీ నెలసరి జీతంతో పాటు కొన్ని ప్రోత్సాహ పధకాలను కూడ ఈ వ్యవస్థలను నిర్వహిస్తున్న  వారు అందిస్తున్నారు. దీనితో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో బ్యాంక్ ల శాఖలు అన్నీ మూతపడుతున్న పరిస్థితులలో ఇక రాబోయే రోజులలో ప్రతి చిన్న ఊరులోను బ్యాంక్ లకు బదులు ఈ బిజినెస్ కరస్పాడెంట్లు కనిపించే ఆస్కారం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: