ఆది పురుష్: కనీవిని ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చరిత్రలో వెన్నడో లేని విధంగా జరుపబోతోంది సినిమా యూనిట్.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ ఆది పురుష్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది. దేవదత్త నాగే ఇంకా సన్నీ సింగ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. అలాగే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా జూన్ 16వ తేదీన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈరోజు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పటికే మూవీ యూనిట్ అంతా అక్కడికి చేరుకుంది. ఇక ఈ ఉదయం పూట వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రభాస్ సన్నిహితులతో కలిసి సందర్శించాడు.తెల్లటి కుర్తా పైజామాలో రెబల్ స్టార్ ప్రభాస్ నడుచుకుంటూ బయటకు వస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


ఈ రోజు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెకండ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మన రామాయణ కథనే సరికొత్తగా తెరకెక్కించి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు టీమ్. ఇక ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో టి సిరీస్ సంస్థ నిర్మించగా ఈ సినిమాకు ఓం రౌత్ సహ నిర్మాతగా వున్నాడు. ఇంకా అలాగే రెట్రో ఫైల్స్ అనే సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయింది. అయితే నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ గ్రాఫిక్స్ వర్క్ మీద ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో మళ్లీ గ్రాఫిక్స్ వర్క్ అంతా కూడా చేయించడంతో సినిమా రిలీజ్ లేట్ అయింది. ఇక ఎట్టకేలకు జూన్ 16వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇంకా హిందీ భాషలతో పాటుగానే పలు విదేశీ భాషల్లో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: