ది కేరళ స్టోరీ సినిమాపై సంచలన కామెంట్స్ చేసిన కమల్ హసన్..!?

Anilkumar
సందీప్తో  దర్శకత్వంలో ఆదశర్మ హీరోయిన్గా నటించిన తాజా సినిమా ది కేరళ స్టోరీ. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.ఇక కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు.అంతేకాదు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఆదరణలను పొందింది ఈ సినిమా. అయితే ఎప్పటి వరకు ఈ సినిమాపై ఎంతో మంది ప్రశంసలు కురిపించినప్పటికీ చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. 

తాజాగా కేరళ స్టోరీ సినిమాపై లెజెండరీ యాక్టర్ కమలహాసన్ కొన్ని సంచలమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఇది కేరళ సినిమా పోస్టర్ పై ఇది యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన అనే క్యాప్షన్ ఉన్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై నటుడు కమల్ హాసన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించడు కమలహాసన్. ఇది యదార్ధ సంఘటనలతో తీసిన సినిమా అని పోస్టర్ పై వేస్తే సరిపోదు నిజంగానే జరగాలి అప్పుడే ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ కానీ కేరళ స్టోరీ సినిమా నిజం కాదని కొన్ని సంచలమైన వ్యాఖ్యలను చేశాడు కమలహాసన్. అయితే ఈ సినిమా స్టోరీ ని ప్రాపగాండా సినిమాగా అభివర్ణించారు అంటూ ఈ సినిమాపై

కొన్ని సంచలన కామెంట్లను చేసారు కమలహాసన్. ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్ తనదైన శైలి లో కౌంటర్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్తో. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేసే వారి గురించి నేను పట్టించుకోను.. కనీసం స్పందించను.. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారందరూ కూడా సినిమా చూడకముందే ఇది ఒక ప్రాపగండా సినిమా అని అంటున్నారు.. కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్లే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.. అంటూ తెలిపాడు సందీప్తో.ఇక ఈ సినిమాని విమర్శించిన వారి సంఖ్య కంటే ప్రశంసించిన వారి సంఖ్య ఎక్కువ ఉంది కనుక అలా విమర్శలు చేసే వారి కామెంట్ ను నేను ఏమాత్రం పట్టించుకోను అని ఈ సందర్భంగా కమలహాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు ఈ సినిమా డైరెక్టర్ సందీప్తో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: