స్టార్ హీరోయిన్ పై చెయ్యి చేసుకున్న బాలయ్య బాబు....!!

murali krishna
బాలయ్యకు కోపం వచ్చింది. ఆయనకు కోపం వస్తే ఏం చేస్తారో తెలుసుగా.. చెంప చెల్లుమనిపిస్తారు. అయితే ఈసారి ఆ వంతు హీరోయిన్ శ్రీలీలకు వచ్చింది. శ్రీలీల చెంప చెల్లుమనిపించారట బాలయ్య. అదేంటి హీరోయిన్ పై చేయిచేసుకోవడం ఏంటీ  అని అనుమానం వస్తోంది కదా.. అసలు విషయం ఏంటంటే.?
ప్రస్తుతం తెలుగు తెరపై దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీలీల కూడా ఒకరు ఫస్ట్ మూవీ ప్లాప్ అయినా.. ఆమె పెర్పామెన్స్ కు ఫిదా అయిన మేకర్స్ వరుసగా ఆఫర్లు  శ్రీలీలకు ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ్ లాంటి స్టార్ హీరోకు జోడీగా నటించిన ఈ బ్యూటీ.. ఈసారి ఏకంగా బాలయ్య సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. అయితే బాలయ్య జోడీగా మాత్రం కాదు. ఆయన మేనకోడలిగా శ్రీలీల నటిస్తున్నట్టు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో.. బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా.. శ్రీలీల బాలయ్య మేనకోడలిగా నటిస్తున్న మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోందిత. NBK108 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ లో బాలయ్య బాబు శ్రీలీల చెంప చెల్లుమనిపించినట్టు తెలుస్తోంది.  సీన్ లో భాగంగా బాలయ్య ఇలా చేసినట్టు తెలుస్తోంది.
సీన్ లో  లీనం అవ్వడం కోసం హీరోయిన్ శ్రీలీల స్వయంగా తనన కొట్టమని అడగడంతో బాలయ్య శ్రీలీలపై చేయిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదంతా షూటింగ్ లో భాగంగా జరిగినా.. సెట్ లో ఉన్నవాళ్ళంతా ఈ సీన్ తో బిత్తరపోయినట్టు తెలుస్తోంది. బాలయ్య కొట్టడంతో శ్రీలీలలో దుఖం పొంగుకు వచ్చి బోరున ఏడ్చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని..ఫిల్మ్ సర్కిల్ లో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇక అనిల్ రావిపూడి బాలయ్యను డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ సినిమాకు సబంధించిన మేజర్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు ప్రస్తుతం సాంగ్స్ కు సబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈమూవీని దసరా కానుకగా సెంప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: