మళ్లీ పెళ్లి: ఆ వర్గానికి అయితే నచ్చుతుంది.. కానీ?

Purushottham Vinay
మళ్లీ పెళ్లి అనేది నరేష్ రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల సమాహారమే. ఈ సినిమా కథని ఎంత ఫిక్షన్ కథ అని చెప్తున్నా.. లోపల జరుగుతున్న సీన్స్ అన్నీ కూడా నరేష్ జీవితంలో జరిగినవే అనేది అర్థమవుతుంది. కాకపోతే ఈ సినిమాలో కాస్త డీప్ గా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూపించాడు నరేష్. ముఖ్యంగా తన మూడో భార్య రమ్యతో ఉన్న గొడవలను కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసాడు.నరేష్ ఈ మూవీ తీయడానికి ప్రధాన ఉద్దేశ్యం తనకు, పవిత్రకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో ప్రపంచానికి  చెప్పాలనుకోవడమే.ఇంకా అలాగే తన జీవితంలో మూడు పెళ్లిళ్లెందుకు చేసుకోవాల్సి వచ్చింది.. ఏ సందర్భంలో అలా చేసుకోవాల్సి వచ్చిందనేది కూడా స్క్రీన్ మీద చూపించాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని ఇంకా రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి కాదని చెప్పాడు నరేష్. కానీ ఈ మూవీలో ఈమె పాత్రే మెయిన్ విలన్.  


తనను ఆమె ఎంతగా వేధించిందో  నరేష్ చెప్పాలనే ప్రయత్నం చేశాడు.అయితే అవన్నీ నిజాలే అని నమ్మలేం కూడా. ఎందుకంటే వాళ్లే ఈ సినిమా ఫిక్షన్ అన్నారు కాబట్టి. అలాగే నరేష్, పవిత్ర బయట ఉన్న రిలేషన్ కథకు బాగా హెల్ప్ అయింది. వాళ్లిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ న్యాచురల్‌గా అనిపిస్తాయి. అందుకే దర్శకుడు ఎమ్మెస్ రాజు కూడా ఈ ఇద్దరిపైనే బాగా ఎక్కువగా ఫోకస్ చేసాడు. ఫస్టాఫ్ అంతా కూడా పార్వతితో పరిచయం.. ఆ తర్వాత నరేష్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ  నేపథ్యంలోనే నడిపారు. కీలకమైన సెకండాఫ్‌లో అసలు మాజీ భార్య రమ్యతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకా అలాగే పవిత్ర లైఫ్‌లో ఏం జరిగింది అనేది చూపించాడు. అయితే ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ యూత్ ఈ సినిమాని చూడటానికి థియేటర్ కి వస్తారో లేదో తెలీదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం కనెక్ట్ అవ్వొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఒక సీరియల్ లాగా ఉంటుంది. సీరియల్ ని ఇష్టపడే వారు ఈ సినిమాని ఇష్టపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: