సోషల్ మీడియాలో అరుదైన రికార్డ్ సాధించిన పవిత్ర లోకేష్..!?

Anilkumar
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ప్రముఖ టాలీవుడ్ నటి పవిత్ర లోకేష్ పేరు  వినబడుతుంది. మళ్ళీ పెళ్లి సినిమాలో ప్రధాన పాత్రలు నటిస్తున్న పవిత్రలోకేష్ పేరు సోషల్ మీడియాలో మారూమ్రోగుతోంది. ఇప్పటికే మళ్ళీ పెళ్లి సినిమాకి బుకింగ్స్ పరవాలేదు అన్న స్థాయిలో ఉండగా పాజిటివ్ టాక్ ఉంటే మాత్రం ఈ సినిమా పరిస్థితి మారే అవకాశం ఉంది .ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది .అయితే ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమా గనక సక్సెస్ అయితే ఆమె కెరీర్ కు ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది.

 ఈ సినిమానే కాకుండా ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీబిజీగా ఉంది పవిత్ర లోకేష్ .ఆమె క్రేజ్ కి తగ్గట్టుగానే ఆమె భారీ రెమ్యూనరేషన్ సైతం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకుగాను ఆమెకి లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ పెళ్లి సినిమా లాగా కాకుండా సరైన పాత్రలు ఏంచుకుంటూ మంచి సినిమాల్లో నటిస్తే ఆమె కెరియర్ కు ఎలాంటి డోకా ఉండదని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర ఇండస్ట్రీల నుండి కూడా పవిత్ర లోకేష్ కి సినిమాల ఆఫర్లు వస్తున్నాయట. దీంతో పవిత్ర లోకేష్ తెలుగులోనే సినిమాలు చేస్తారా లేదా ఇతర ఇండస్ట్రీలో వస్తున్న ఆఫర్స్ లకు ఓకే చేస్తారా లేదా అన్నది చూడాలి.

 అయితే పవిత్ర లోకేష్ మరియు టాలీవుడ్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమా తెలుగులోనే కాకుండా కన్నడ భాషలో సైతం విడుదల కానుంది. ఆ భాషలో కూడా ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరికొన్ని సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో పవిత్ర లోకేష్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించడంతో ఆమె సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాన్స్ అయ్యారు. దీంతో పవిత్ర లోకేష్ కు సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: