అక్కినేని శతజయంతి ఆలోచనలలో నాగార్జున !

Seetha Sailaja
ఈ నెల మే 28తో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు సమాప్తం కానున్నాయి. గత సంవత్సరం మే నెల నుండి ఈ సంవత్సరం మే నెల వరకు 12 నెలల పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను చాల ఘనంగా నిర్వహించారు. విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు అనేక ప్రముఖ పట్టణాలలో ఎన్టీఆర్ శతజయంతిని చాల పెద్ద స్థాయిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాలను స్వయంగా బాలకృష్ణ రంగంలోకి దిగి అందర్నీ కలుపుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహించడంతో ఎన్టీఅర్ శతజయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమ స్ఫూర్తి అక్కినేని కుటుంబ సభ్యులకు తాకినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం అక్కినేని శతజయంతి జరగబోతున్న నేపద్యంలో సుమారు 6 నెలలకు ముందే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ఫైనల్ డ్రాప్ట్ ను తయారు చేయాలని నాగార్జున తన సన్నిహితులతో ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారంమేరకు అక్కినేని నాగేశ్వరావు పేరిట ఫిలిం ఫెస్టివల్ ఫోటో ఎగ్జిబిషన్ ఫ్యాన్ క్లబ్ మీటింగ్స్ ఇలా చాల కార్యక్రమాలు నాగార్జున ఆలోచనలలో ఉన్నాయి అని అంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని బ్లాక్ బస్టర్స్ సినిమాలను ఎంపికచేసి తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ధియేటర్లలో ప్రేక్షకులకు ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ఉచితంగా చూపెట్టాలని కూడ నాగార్జున ఆలోచనలలో ఉంది అని అంటున్నారు.

ఎన్టీఆర్ శతజయంతికి సంబంధించి అన్ని పనులు బాలకృష్ణ చూసుకున్నాడు. మరి ఆ స్థాయిలో నాగార్జున కూడ చూసుకుని అందర్నీ కలుపుకుని తన తండ్రి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించ గలిగితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా భావించే అక్కినేని ఎన్టీఆర్ లకు సముచిత గౌరవం ఇచ్చినట్లే అవుతుంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ తమ హీరోలు సరైన హిట్ ఇవ్వలేకపోతున్నారు అన్న విపరీతమైన బాధలో ఉన్నారు. ఆ బాధను తొలగించే విధంగా అక్కినేని శతజయంతి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: