సీనియర్ నటుడికి.. వార్నింగ్ ఇవ్వబోతున్న చరణ్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బడా హీరోలలో అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. చిరంజీవి వారసత్వాన్ని   నిలబెడుతూ ఇక తనదైన డాన్సులు యాక్షన్ సీక్వెన్స్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రామ్ చరణ్   అంతేకాకుండా మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు. ఇక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

 ఇక ప్రస్తుతం గేమ్ చేంజ్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని టాక్ కూడా ఉంది. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ జూన్ మొదటి వారం నుంచి మొదలు పెట్టబోతున్నారట. ఇక ఈ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తో పాటు ప్రముఖ సీనియర్ నటుడు సముద్రఖిని కూడా పాల్గొంటారని సమాచారం.

 ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందట. అంతేకాదు మొదట ఒక వార్నింగ్ సీన్ షూట్ చేయబోతున్నారట. ఈ సినిమాలో వార్నింగ్ సీన్ ఎంతో హైలెట్ కాబోతుందట. దీంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: