అందులో పదేళ్ల అనుభవం ఉంది అంటున్న రష్మీ...!!

murali krishna
జబర్దస్త్ షోకి రష్మీ యాంకర్ గా జర్నీ స్టార్ట్ చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది. రోజురోజుకు తన యాంకరింగ్ ని మెరుగు పరుచుకుంటూ వెళ్ళింది.. యాంకర్ గా చేస్తూనే మరో వైపు మూవీస్ లో అవకాశాలను అందుకుంది. బోల్డ్ మూవీస్ లో ఎంతో బోల్డ్ గా నటించింది రష్మీ. ఇక ఏ స్క్రీన్ ఐనా సరే గ్లామర్ షో చేయడంలో రష్మీ తర్వాతే ఎవరైనా... సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఆమెకు మూగ జీవాలంటే చాలా ఇష్టం.
వాటికి అన్యాయం జరిగింది అంటే చాలు క్షణం ఆలస్యం చేయకుండా స్పందిస్తూ ఉంటుంది. వాటి కోసం వైజాగ్ లో ఒక ఆర్గనైజషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇక బుల్లితెర మీద తన జర్నీ స్టార్ట్ చేసి పదేళ్లు ఐన సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ మొత్తం ఫాన్స్ అభిమానం  , వాళ్ళ హార్ట్ ఫుల్ మెసేజెస్ తో నిండిపోయాయి. జబర్దస్త్ లో రష్మీకి అంత పేరు రావడానికి సుధీర్ కి కూడా మంచి హైప్ రావడానికి కారణం వాళ్ళ లవ్ ట్రాక్. బుల్లితెర మీద వీళ్ళ ప్రేమాయణం చూసిన ఆడియన్స్ వీళ్ళు నిజంగానే వివాహం చేసుకుంటారేమో అనిపించేలా చేసేవాళ్ళు. కానీ తర్వాత అదంతా షో రేటింగ్ కోసం మాత్రమేనని పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
కానీ ఫాన్స్ ఎవరూ ఈ విషయాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని  ఆతృతగా ఎదురుచూసే అభిమానులు బోల్డు మంది ఉన్నారు. "హోలీ" మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ తర్వాత  చాలా మూవీస్ లో సపోర్టింగ్ రోల్ లో నటించింది. తర్వాత ఇంకొన్ని మూవీస్ లో నటించింది కానీ ఆమెకు అనుకున్నంత మంచి కెరీర్ సిల్వర్ స్క్రీన్ మీద రాలేదు. "గుంటూరు టాకీస్" లో మెయిన్ లీడ్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం "భోళా శంకర్" మూవీలో నటిస్తోంది. వెండితెర మీద పేరు రాకపోయినా బుల్లితెరను మాత్రమే ఎలేస్తోంది ఈ అమ్మడు. తాను యాంకరింగ్ చేసిన జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. రీసెంట్ గా "బొమ్మ బ్లాక్ బస్టర్" మూవీలో నటించింది రష్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: