ధనుష్ సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న సందీప్ కిషన్..!?

Anilkumar
ధనుష్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ తిరుచిత్రంబలం అనే సినిమాతో  హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాని తిరు పేరుతో కూడా తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత ధనుష్ 50వ సినిమాని కూడా సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నట్లు గత కొంత కాలం క్రిందట అధికారికంగా ప్రకటించారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అలాగే నటీనటుల వివరాలు అధికారికంగా ఇంకా బయట పెట్టలేదు. కానీ తమిళ వర్గాలతో పాటు తెలుగు ఆడియన్స్ లో సైతం ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తి నెలకొంది. 

అయితే ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. అంతేకాదు ధనుష్ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమాలో విష్ణు విషయాలు కాళిదాసు జయరాం దసరా విజయనగంటి వారు కొన్ని కీలక పాత్రలు నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే తాజాగా ఇప్పుడు ఒక టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు సందీప్ కిషన్. కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడు అయిన సందీప్ కిషన్ తెలుగులో హీరోగా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయాడు.

ఇప్పటికీ హీరోగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ స్టార్ హీరో క్రేజ్ ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. ఇక అలాంటి సందీప్ కిషన్ ఇప్పుడు ధనుష్ 50వ సినిమాలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా అమ్ముతున్న సమాచారం మేరకు సందీప్ కిషన్ ధనుష్ 50వ సినిమాలో అతని సోదరుడు పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటికే సందీప్ కిషన్ ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే అక్కడ ఏర్పడిన పరిచయం కారణంగా సందీప్ కిషన్ ఈ సినిమాలో కూడా చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ నటిస్తున్నాడా లేదా అన్న తెలియాలంటే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: